యలహంక ఇంటిపై కోర్టుకు జగన్ ?- షర్మిలను అడ్డుకోవాలంటూ..!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (YS Jagan) చెందిన బెంగళూరులోని యలహంక నివాసం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ ఇంట్లో తన కుమార్తె అంజిలీ రెడ్డి పెళ్లికి ప్లాన్ చేసుకున్న వైఎస్ షర్మిల కు జగన్ నిరాకరణతో షాకిచ్చారు. దీంతో ఆమె వేరే చోట తన కుమార్తె పెళ్లి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పటికే పలువురు ఆహ్వానితుల్ని స్వయంగా కలిసి ఈ పెళ్లి పత్రికలు పంచుతున్న షర్మిల.. రేపో మాపో యలహంక ఇంటికి వెళ్లి అన్న వైఎస్ జగన్ కు కూడా ఆహ్వానం ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ దీన్ని అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
వైఎస్ షర్మిల తన కుమార్తె అంజిలీ రెడ్డి పెళ్లి కోసం రేపు ఆదివారం బెంగళూరుకు వెళ్తున్నారు. అక్కడి యలహంక నివాసంలో పెళ్లి పెట్టుకోనివ్వకుండా భద్రతా కారణాలతో జగన్ అడ్డుకున్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులతో తన నివాసంలో బస చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. దీంతో జగన్ యలహంక నివాసం ఆమెది కాదని, ఆమె అక్కడ అడుగుపెట్టకుండా ఆదేశాలు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ స్థానిక దేవనహళ్లి కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాను ఉంటున్న యలహంక నివాసం తన అత్తగారు సుగుణమ్మది కావడంతో దానిపై షర్మిల కు ఎలాంటి హక్కులు లేవని జగన్ వాదిస్తున్నారు.

అయితే ఇప్పుడు పెళ్లి బస పేరుతో షర్మిల అక్కడికి వచ్చి ఎంట్రీ ఇస్తే.. భవిష్యత్తులో సమస్యగా మారకుండా జగన్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే షర్మిల ఈ నివాసంలోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు. కోర్టు ద్వారా కాకుండా నేరుగా తన మనుషులతో షర్మిలను అడ్డుకుంటే ఇది రాజకీయ వివాదంగా మారుతుందని ఆలోచిస్తున్న జగన్.. ఇలా పిటిషన్ వేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై అటు వైఎస్ జగన్ వర్గాలు కానీ, షర్మిల వర్గాలు కానీ ఇప్పటివరకూ బహిరంగంగా స్పందించలేదు. గతంలో అంజిలీరెడ్డి పెళ్లి అక్కడ వద్దని జగన్ చెప్పిన విషయంపై మాత్రం ఇరువర్గాలు మాటల యుద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వివాదంపై కోర్టు ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారబోతున్నాయి.














Click it and Unblock the Notifications
