ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ బిగ్ బూస్ట్: ఏకంగా 5 మిలియన్ డాలర్లు

భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఏకంగా అయిదు మిలియన్ డాలర్ల సాయం అందించనున్నట్లు ప్రకటించింది. మన కరెన్సీతో పోల్చుకుంటే దీని విలువ 46 కోట్ల రూపాయలకు పైమాటే. దేశంలో నెక్స్ట్ జెన్ సైంటిఫిక్, టెక్నాలజీ టాలెంట్ ను తీర్చిదిద్దడంతో పాటు ఏఐ రీసెర్చ్ ను వేగవంతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.

ఐఐటీ ఖరగ్‌పూర్‌ 75వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్ డైరెక్టర్ సుమన్ చక్రవర్తి ఈ వివరాలను వెల్లడించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి కావడం దీనికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. తమ మాతృ సంస్థలో నూతన సాంకేతిక ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించాలనే ఆయన ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుమన్ చక్రవర్తి చెప్పారు.

Google announces five million dollar funding for IIT Kharagpur for advanced AI research accelerate

ఈ నిధుల ద్వారా గూగుల్, ఐఐటీ ఖరగ్‌పూర్‌ కలిసి ప్రాక్టికల్ రీసెర్చ్ ను మరింత విస్తరిస్తాయి. ప్రత్యేకించి.. భారత్ లో ప్రాంతీయ భాషల డిజిటలైజేషన్, వ్యవసాయ రంగంలో మెరుగైన ఆవిష్కరణలు, మెటీరియల్ సైన్స్, విద్యా రంగానికి సంబంధించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్స్ తయారీ ప్రాజెక్టులలో ఈ పరిశోధనలు కీలకంగా మారనున్నాయి. ఈ రెండింటి భాగస్వామ్యం మొత్తం కూడా మూడు విభాగాలుగా పని చేస్తుంది.

సవాళ్లకే సవాళ్లు విసిరకుండా నేను ఉండలేను: ప్రధాని మోదీ
సవాళ్లకే సవాళ్లు విసిరకుండా నేను ఉండలేను: ప్రధాని మోదీ

మొదటిది.. అధునాతన ఏఐ పరిశోధనలను ప్రోత్సహించడం, రెండోది.. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడం, మూడోది.. క్యాంపస్ పరిధిలో ఏఐ మౌలిక సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం. దీని ద్వారా ఐఐటీ ఖరగ్‌పూర్‌ లోని రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, టూల్స్ అందుబాటులోకి తీసుకొస్తాయి.

తిరుమలలో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు- అరుదుగా: ఏడాదికి ఒక్కసారి
తిరుమలలో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు- అరుదుగా: ఏడాదికి ఒక్కసారి

ఐఐటీ ఖరగ్‌పూర్‌తో కలిసి పని చేయబోతోండటం పట్ల సుందర్ పిచాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ భారతీయ భాషలు, వ్యవసాయం, విద్యా రంగాల్లో అద్భుతమైన పరిశోధనలు సాగిస్తోందని, దీన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని అన్నారు. పూర్వ విద్యార్థిగా ఒకప్పుడు తన భవిష్యత్తును తీర్చిదిద్దిన ఈ విద్యాసంస్థ.. రాబోయే తరం విద్యార్థులకు బంగారం బాటలు వేయడానికి తోడ్పాటు అందించడం గర్వకారణమని చెప్పారు.

మన భూమికి ఓ తోడు దొరికిందోచ్- కొత్త చందమామ: కారంత సైజు
మన భూమికి ఓ తోడు దొరికిందోచ్- కొత్త చందమామ: కారంత సైజు

ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ఏఐ ఫలాలు భారత్‌లోని అందరికీ అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిధుల సాయంతో ఐఐటీ ఖరగ్‌పూర్‌ లో విద్యార్థులు, అధ్యాపకుల కోసం కొత్త ఏఐ ట్రైనింగ్ కోర్సులతో పాటు విద్యార్థులు నూతన ఏఐ టూల్స్ ఉపయోగించి పరిశోధనలు చేయడానికి అవసరమైన వ్యవస్థను ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తారు. భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడం వల్ల దేశంలో గ్రామీణ ప్రాంతాలకు సైతం డిజిటల్ సేవలు వేగంగా అందుతాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+