ఆ ఒక్క సినిమా వదులుకొని కెరీర్ ను కాపాడుకున్న ప్రభాస్‌

సినీ కెరీర్‌లో ఏ సినిమాను ఓకే చేయాలన్నదానికంటే, ఏ సినిమాను సున్నితంగా తిరస్కరించాలన్నదే కొన్నిసార్లు హీరోల భవిష్యత్తును మలుపు తిప్పుతుంది. 'ఫౌజీ', 'స్పిరిట్' వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన మలుపే జరిగింది. కెరీర్ ఆరంభంలో 'సింహాద్రి', 'ఆర్య', 'కిక్' లాంటి హిట్లను చేజార్చుకున్నారని ఫ్యాన్స్ అనుకున్నా, ఒక భారీ డిజాస్టర్‌ను వదులుకోవడం ద్వారా ఆయన తన కెరీర్‌ను సేఫ్ చేసుకున్నారనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది.

Top 10 Heroes: మారిన పాపులారిటీ లెక్కలు.. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌, రామ్ చరణ్‌ స్థానాలివే..
Top 10 Heroes: మారిన పాపులారిటీ లెక్కలు.. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌, రామ్ చరణ్‌ స్థానాలివే..

'బిల్లా' వైపు మొగ్గు

దర్శకుడు మెహర్ రమేష్ 'కంత్రి' తర్వాత ప్రభాస్‌కు రెండు లైన్‌లు చెప్పారట. అందులో ఒకటి 'బిల్లా', మరొకటి 'శక్తి'. శక్తి పీఠాల నేపథ్యంలో సాగే 'శక్తి' కథలోని ఫాంటసీ అంశాలు ప్రభాస్‌కు అంతగా కనెక్ట్ కాలేదట. దాంతో రిస్క్ తీసుకోకుండా, స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బిల్లా'కే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభాస్‌ను స్టైలిష్‌గా ప్రజెంట్ చేయడంలో మెహర్ రమేష్ సక్సెస్ కావడంతో 'బిల్లా' ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

Prabhas saved his career by letting go of that one film

'శక్తి'తో ఎన్టీఆర్‌కు ఎదురైన చేదు అనుభవం

ప్రభాస్ పక్కన పెట్టిన 'శక్తి' ప్రాజెక్ట్‌ను ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పట్టాలెక్కించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తారక్ కెరీర్‌లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అంతేకాదు, నిర్మాత అశ్విని దత్‌కు ఈ సినిమా పెద్ద ఆర్థిక దెబ్బనే వేసింది. ఆ తర్వాత ఆయన చాలాకాలం పాటు నిర్మాణానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ప్రభాస్ ఆ రోజు 'శక్తి'కి ఓకే చెప్పి ఉంటే, ఆయన కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేదని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.

ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన 'షాడో', 'భోళా శంకర్' కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఆనాడు 'శక్తి'ని వదులుకోవడం ఆయన కెరీర్‌కు పెద్ద ప్లస్‌గానే నిలిచిందని అభిమానులు చర్చించుకుంటారు. మొత్తానికి కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయడం, కొన్ని ప్రాజెక్టులను వదులుకోవడం కూడా స్టార్ హీరోల కెరీర్‌లో కీలక పాత్ర పోషిస్తుందని ఈ ఉదంతం మరోసారి గుర్తు చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+