రాజీనామా పై ఆదినారాయణ రెడ్డి బిగ్ ట్విస్ట్- తెర మీదకు కొత్త డిమాండ్...!!

జమ్మలమడుగు ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి కీలక ప్రకటన చేసారు. కడప జెడ్పీ సీటు విషయం లో అన్యాయం జరిగిందని మరోసారి వాపోయారు. తన సోదరుడి కుమారులు ఇద్దరూ జెడ్పీటీసీ పదవులకు రాజీనామా చేసారని వెల్లడించారు. తాను ఢిల్లీ వెళ్లి పార్టీ నేతలతో చర్చిస్తానని.. తన రాజీనామా పైన అప్పుడే నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేసారు. కూటమిలో సమన్వయం లేదని వ్యాఖ్యానించారు. తమకు అన్యాయం జరిగిందని చెప్పిన ఆదినారాయణ రెడ్డి తెర మీదకు కొత్త డిమాండ్ తీసుకొచ్చారు.

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కడప జెడ్పీ సీటు తమకే అని ప్రకటన చేసే అయిదు నిమిషాలు ముందు వరకు చెప్పారని.. జాబితాలో మాత్రం మార్చేసారని వాపోయారు. తాము కడప జిల్లాలో స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం శ్రమించామని చెప్పారు. తమ సోదరుల కుమారులు ఇద్దరు జెడ్పీటీసీ పదవులకు రాజీనామా చేసారని... జెడ్పీ వ్యవహారం తేలే వరకు వారు వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసారు. తనతో బీజేపీ రాష్ట్రం, జాతీయ నేతలు చర్చించారని వివరించారు. రాష్ట్రంలో బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన బీజేపీ జాతీయాధ్యక్షుడికి లేఖ రాసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి, లోకేష్ తో చర్చలు చేసినా.. ఏ మాత్రం ఆశాజనకంగా స్పందన లేదని పేర్కొన్నారు. కూటమి పార్టీల మధ్య స్పష్టత లేదని.. కోస్తా జిల్లాలతో పాటుగా ధర్మవరం.. అనంతపురంలో బీజేపీకి ఇబ్బంది కలిగిందని వివరించారు.

 అమరావతికి కేంద్రం మరో వరం, కీలక మలుపు..!!
అమరావతికి కేంద్రం మరో వరం, కీలక మలుపు..!!
mla-adinarayana-reddy-announces-resignation-of-brother-s-sons-reveals-delhi-visit

కడప ఎంపీ సీటు పై కీలక వ్యాఖ్యలు

ఒక ఎమ్మెల్యే తమ అభ్యర్ధులను అవమానించారని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. కడప జెడ్పీ విషయంలో ప్యాకేజీ ఏమైనా నడిచిందా అనే అనుమానం వ్యక్తం చేసారు. జాబితా ప్రకటనకు అర గంట ముందు తమకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారని.. చివరి నిమిషంలో ఎందుకు మారిందని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి అవసరం లేదని.. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసారు. ఏపీకి కేంద్రం అనేక రకాలుగా సాయం అందిస్తుందని వివరించారు. అయినా, కూటమిలో మాత్రం బీజేపీకి అన్యాయం చేసారని ఆరోపించారు. బీజేపీకి ఇచ్చామని చెప్పి టీడీపీ తీసుకోవటం ఏంటని ప్రశ్నించారు. తాను నాలుగో సారి ఎమ్మెల్యే అయ్యానని.. తనకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదని వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ బలపడాల్సిందేనని స్పష్టం చేసిన ఆదినారాయణ రెడ్డి.. 2029 ఎన్నికల్లో తమ పార్టీతో ఇలాగే వ్యవహరిస్తారనే అనుమానం వ్యక్తం చేసారు. కాగా.. తాము అడిగితే కడప ఎంపీ ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి కొత్త డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో.. ఇప్పుడు బీజేపీ కేంద్ర ముఖ్యులతో ఆదినారాయణ రెడ్డి చేసే చర్చలు.. తుది నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+