అమరావతికి కేంద్రం మరో వరం, కీలక మలుపు..!!

అమరావతి కేంద్రం కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణాలు తొలి దశ 2028 కి పూర్తి చేయాలనే లక్ష్యంతో కొనసాగుతున్నాయి. కేంద్రం అమరావతికి ఇప్పటికే పలు రకాలుగా తమ మద్దతు అందిస్తోంది. రైల్వే శాఖ కొత్త లైన్ ప్రకటించింది. ఓఆర్ఆర్ కోసం టెండర్లను రెండు ప్యాకేజీలుగా ఆహ్వానించారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి మరో కీలక అనుమతి లభించింది. ఈ మేరకు సీఆర్డీఏతో ఒప్పందం జరిగింది. అమరావతికి ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

అమరావతిలో సెబీ కార్యాలయం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన లీజు అగ్రిమెంట్ శుక్రవారం పూర్తయ్యింది. సెబీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు APCRDA 1.78 ఎకరాల భూమిని అమరావతిలోని నేలపాడులో ఆ సంస్థకు కేటాయించింది. శుక్రవారం, 2026 నవంబర్ 20న సంబంధిత అగ్రిమెంట్ పత్రాలను ఏపీసీఆర్డీఏ ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, సెబీ చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యకుమార్ కు అందించారు. అమరావతిలో సెబీ స్థానిక కార్యాలయంతో పాటు అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో డేటా సెంటర్.. అలాగే ప్రాంతీయ శిక్షణ, నాయకత్వ అభివృద్ధి కేంద్రం సైతం ఇక్కడ నిర్మాణం కానున్నాయి. ఈ కేంద్రంలో శిక్షణ తరగతులు, ఆడిటోరియం, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(MDP) నిర్వహణ చేపట్టను న్నట్లు సెబీ అధికారులు వెల్లడించారు.

 విశాఖ- తిరుపతి వందేభారత్ సిద్దం: హాల్టింగ్ స్టేషన్లు, టైమింగ్స్..!!
విశాఖ- తిరుపతి వందేభారత్ సిద్దం: హాల్టింగ్ స్టేషన్లు, టైమింగ్స్..!!
sebi-office-in-amaravati-agreement-finalised-for-new-office-here-the-full-details

సెబీ కార్యాలయం ఏర్పాటు ద్వారా

అదే విధంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (NISM) సహకారంతో పరీక్షా కేంద్రాన్ని సైతం అమరావతిలో నిర్మించే సెబీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామన్నారు. సెబీ కార్యాలయం, శిక్షణ కేంద్రం, డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా అమరావతిలో ఆర్థిక సేవలు, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి రంగాలలో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. వివిధ జాతీయ స్థాయి సంస్థలకు వేదికగా ఆర్థిక కార్యాకలాపాలకు కేంద్రంగా రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతున్న క్రమంలో కీలక మైన అడుగుగా భావిస్తున్నారు. కాగా.. ఓఆర్ఆర్ రెండు ప్యాకేజీలు పూర్తి చేసేందుకు ఇప్పటికే ఖరారు చేసిన అలైన్ మెంట్ ప్రకారం టెండర్లను ఆహ్వానించారు. రైల్వే ప్రాజెక్టు పైనా తుది కసరత్తు కొనసాగుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్ తో పాటుగా భారీ టెర్మినల్ ఏర్పాటు దిశగా ప్రాంతాలను గుర్తించారు. డీపీఆర్ కు అధికారిక ఆమోదం రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+