నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీరా నాయనా?
శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై కృతాక్షి నిర్మాణంలో తెరు చలపతి కుమార్ పువ్వల తెరకెక్కిస్తున్న సినిమా 'మన డాక్టర్ బాబే'. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో మోహన సిద్ధి, శృతి శంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ సినిమాను నవంబర్ 20న రిలీజ్ చేశారు. ఫ్యామిలీతో కలిసి చూసేలా చక్కటి వినోదాత్మకంగా వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుంది? అన్నది ఓ సారి చూద్దాం.
స్టోరీ ఏమిటంటే?
చిన్నప్పుడే పేరెంట్స్‌ని కోల్పోయిన రాజు (శ్రీ స్కంద) మీద మేనమామ దుర్గారావు (రాజీవ్ కనకాల)కు అంతగా సదభిప్రాయం ఉండదు. తన కూతురు సింధు (శ్రుతి శంకర్)ని ఇవ్వాలంటే డాక్టర్ కావాలనే కండీషన్ పెడతాడు. మరదలి కోసం కష్టపడి డాక్టర్ అయినా.. 'ఆండ్రాలజిస్ట్' అనే ట్యాగ్ చూసి మళ్లీ షరతు పెడతాడు దుర్గారావు - ఆ పేరు తీసేస్తేనే పెళ్లి చేస్తానని. కానీ రాజు తన వృత్తి విషయంలో వెనక్కి తగ్గడు. అసలు రాజు ఆండ్రాలజిస్ట్‌గా ఎందుకు మారాడు? ఈ జర్నీలో గౌతమి (మోహన సిద్ధి), డాక్టర్ సుఖం (అలీ), తాత రత్నం (కోటేశ్వరరావు) పాత్రల మలుపులేంటి? అనేదే అసలు స్టోరీ.

సినిమా ఎలా ఉందంటే?
బావ-మరదలు, మేనమామ-అల్లుడు అనుబంధాల చుట్టూ సాగే సహజమైన కథనం. ఫస్టాఫ్‌లో ఆండ్రాలజిస్ట్ చుట్టూ తిరిగే సరదా సన్నివేశాలు, ఇంటర్వెల్ షరతు తర్వాత మారే ఎమోషనల్ టోన్ సినిమాకు బలం. కాన్సెప్ట్‌ను హద్దు దాటకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడని విధంగా తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. శ్రీ స్కంద (రాజు) డెబ్యూ సినిమా అయినా కామెడీ, ఎమోషన్, యాక్షన్‌లో సులువుగా ఒదిగిపోయాడు. మోహన సిద్ధి , శృతి శంకర్ తెరపై ఆకట్టుకునే లుక్స్‌తో పాటు తమ పాత్రలకు తగిన ప్రాధాన్యతతో మెప్పించారు. రాజీవ్ కనకాల, అలీ, కోటేశ్వరరావు మేనమామ, తాత పాత్రల ఎమోషన్స్‌తో పాటు సెకండాఫ్‌లో అలీ కామెడీ నవ్వులు పంచుతుంది.
సాంకేతిక అంశాలు
కిషోర్ బోయిడపు విజువల్స్, మనోజ్ కుమార్ సంగీతం, సెల్వ కుమార్ ఎడిటింగ్, రామకృష్ణ గరగ కథ, అర్థవంతమైన పాటలు, మాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. మొదటి ప్రాజెక్ట్ అయినా నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు.
ఫైనల్‌గా..
కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలగలిసిన క్లీన్ ఎంటర్‌టైనర్!
రేటింగ్: 3/5.














Click it and Unblock the Notifications
