ఎపిక్ రామాయణ వేవ్: ప్రధాని మోదీ కీలక నిర్ణయం

ఎపిక్ పాన్ ఇండియా మూవీ రామాయణ.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తోంది. విడుదలైన 15 రోజుల్లో ఈ మూవీ కలెక్షన్లు 1,500 కోట్ల రూపాయలను దాటడం దీనికి నిదర్శనం. ఇప్పటివరకు ఏ ఫిల్మ్ కూడా ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. బాహుబలి, దురంధర్, పుష్ప.. రామాయణ కలెక్షన్ల ముందు దిగదుడుపే అయ్యాయి. న్యూ బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోందీ మూవీ.

రామాయణ.. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఆకట్టుకుంది. దీంతో ఆయన ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కేరళ కొల్లంలో గల జటాయు ఎర్త్ సెంటర్‌ను సందర్శించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదు గానీ.. ఈ నెల చివరివారంలో గానీ, డిసెంబర్ మొదటి వారంలో గానీ ప్రధాని మోదీ కొల్లం జిల్లాకు రానున్నట్లు కేరళకే చెందిన కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు.

PM Modi will visit the Jatayu Earth Centre at Chadayamangalam in Kollam Kerala after Ramayana movie wave

ఆయన రాక కంటే ముందే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. జటాయు ఎర్త్ సెంటర్‌ను సందర్శించనున్నారు. అక్కడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించనున్నారు. జటాయు ఎర్త్ సెంటర్ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటోన్నామని సురేష్ గోపి వెల్లడించారు. ప్రధాని మోదీ రాక తర్వాత.. ఇక్కడికి వచ్చే విదేశీయుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కొంపముంచిన శుభ్‌మన్ గిల్ తొందరపాటు నిర్ణయాలు
కొంపముంచిన శుభ్‌మన్ గిల్ తొందరపాటు నిర్ణయాలు

కొల్లం జిల్లా చడాయమంగళంలో ఎత్తయిన కొండపై ఉంటుందీ జటాయు సెంటర్. ప్రముఖ శిల్పి, దర్శకుడు రాజీవ్ అంచల్‌ దీన్ని రూపొందించారు. దేశంలోనే అతిపెద్ద శిల్పకళా అద్భుతంగా పేరుంది దీనికి. రామాయణ విడుదల తర్వాత దీనికి ఒక్కసారిగా సందర్శకుల తాకిడి పెరిగింది. ఇదివరకు ప్రతిరోజూ సుమారు 2,500 మంది పర్యాటకులు మాత్రమే ఈ కేంద్రాన్ని సందర్శించేవారు. రామాయణ విడుదల తర్వాత ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 10,000 కు చేరుకుంది.

తిరుమలలో దినదినాభివృద్ధి: అన్నప్రసాదం విరాళాలు రూ. 3,100 కోట్లు పైమాటే
తిరుమలలో దినదినాభివృద్ధి: అన్నప్రసాదం విరాళాలు రూ. 3,100 కోట్లు పైమాటే

ఈ భారీ జటాయు నిర్మాణం 2018 లో పూర్తయింది. శిల్పి, ప్రముఖ దర్శకుడు రాజీవ్ అంచల్ దీనికి రూపకల్పన చేశారు. కాలినడకన పర్యాటకులు కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. రోప్‌ వే కూడా అందుబాటులో ఉంది. రోప్‌ వే ఫీజు 640 రూపాయలు. మెట్ల మార్గం ద్వారా వెళ్లే సందర్శకులు రూ. 350 చెల్లించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+