రానున్న 15 రోజులు ఈ 5 రాశులకు తిరుగే లేదన్న బాబా వంగా!
ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య, భవిష్యవాణి కథనాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. బాబా వంగా పేరిట ప్రచారంలో ఉన్న అంచనాలు, గ్రహ స్థితుల ప్రభావాలను జోడించి రూపొందించిన విశ్లేషణల ప్రకారం, నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ తొలి వారం వరకు ఉన్న ఈ 15 రోజుల కాలం ఐదు రాశుల వారికి సానుకూల మార్పులను తీసుకురానుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తగ్గడం, వృత్తిపరమైన ముందడుగులు, పెండింగ్ పనులు కొలిక్కి రావడం వంటి అంశాలు ఈ కాలంలో ప్రముఖంగా కనిపిస్తాయని బాబా వంగా చెబుతున్నారు.
మేషం: ఈ 15 రోజులు మేష రాశి వారికి ఉత్సాహంగా, ముందడుగు వేసేలా ఉంటాయి. ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు లేదా గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త మార్గాలు తెరుచుకోవడంతో పాటు ఆర్థిక నిలకడ పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కుదురుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన రావొచ్చు, ఆస్తి లేదా ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచనలపై స్పష్టత వస్తుంది.

మిథునం: నవంబర్ ముగింపు వేళ మిథున రాశి వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా అనుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు అందే వీలుంది. సహోద్యోగులతో సమన్వయం పెరగడంతో పాటు కొత్త ఆలోచనలు వ్యాపార లాభాలకు దారితీయొచ్చు. పొదుపు అలవాట్లు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులు, భాగస్వాములతో అనుబంధం మరింత బలపడుతుంది.
సింహం: సింహ రాశి వారికి ఈ రెండు వారాలు వృత్తిపరంగా కలిసివచ్చే సమయం. కార్యాలయంలో పైఅధికారుల మద్దతు లభించడంతో పాటు వ్యాపార విస్తరణ ప్రణాళికలకు ఊతం లభిస్తుంది. ఆర్థిక ఒత్తిళ్లు తగ్గి నిల్వలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి మనస్పర్థలు సర్దుమణిగి ప్రశాంతత ఏర్పడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి పట్టుదల ఫలితాన్నిస్తుంది.
వృశ్చికం: కష్టానికి తగిన గుర్తింపు లభించే కాలంగా వృశ్చిక రాశి వారికి ఇది నిలుస్తుంది. కెరీర్‌లో ఎదగడానికి కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన వ్యాపార లేదా వ్యక్తిగత పనులు వేగంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వ్యక్తిగత సంబంధాలలో ఉన్న అపార్థాలు తొలగి సమతుల్యత ఏర్పడుతుంది.
కుంభం: కుంభ రాశి వారికి ఈ కాలం ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఊరటనిచ్చేదిగా ఉంటుంది. పని ప్రదేశంలో కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు. వ్యాపారంలో కొత్త పరిచయాలు, ఒప్పందాలు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన సొమ్ము లేదా పాత పెట్టుబడుల నుంచి ఆశించిన ఫలితం కనిపించవచ్చు. చదువు, వ్యక్తిగత లక్ష్యాల విషయంలో స్పష్టత పెరుగుతుంది.













Click it and Unblock the Notifications
