శబరిమల యాత్రికులకు రైల్వే అలర్ట్- తేడా వస్తే మూడేళ్ల జైలుశిక్ష..!

శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులకు (Sabarimala Pilgrims) దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway) ఇవాళ ఓ అలర్ట్ జారీ చేసింది. ఇందులో రైలు ప్రయాణాల్లో, అలాగే రైల్వే స్టేషన్లలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇందులో వెల్లడించింది. ముఖ్యంగా రైలు ప్రయాణాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారిని అప్రమత్తం చేస్తోంది. కాబట్టి ఆయా చర్యల్ని తప్పనిసరిగా పాటించాలని రైల్వే అధికారులు అయ్యప్పలను కోరుతున్నారు.

కాకినాడ కూటమిలో జడ్పీ ఛైర్ చిచ్చు- అలిగి, ప్రమాణానికీ దూరంగా టీడీపీ వైస్ ఛైర్మన్..!
కాకినాడ కూటమిలో జడ్పీ ఛైర్ చిచ్చు- అలిగి, ప్రమాణానికీ దూరంగా టీడీపీ వైస్ ఛైర్మన్..!

అయ్యప్ప మాల వేసుకుని రైలు ప్రయాణాలు చేసే భక్తులకు అగ్ని ప్రమాదాల నివారణకు దక్షిణ కోస్తా రైల్వే పలు సూచనలు చేస్తోంది. ముఖ్యంగా రైళ్లలో, రైల్వే స్టేషన్లలో పాటించాల్సిన అగ్నిమాపక భద్రతా నిబంధనలను వివరిస్తూ ప్రత్యేక సూచనల్ని విడుదల చేసింది. ఇందులో రైళ్లలో కర్పూరం వెలిగించడం, అగరబత్తులు, కొవ్వొత్తులు వాడటం, హారతి ఇవ్వడం వంటి చర్యల్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు రైల్వే తెలిపింది. అలాగే పెట్రోల్, కిరోసిన్, ఎల్పీజీ సిలెండర్లు, గ్యాస్ స్టౌవ్ లు, క్రాకర్లు, బాణాసంచా లేదా మండే పేలుడు పదార్ధాలను తీసుకెళ్లకూడదని తెలిపింది.

Sabarimala Pilgrims Alert South Coast Railway Issues Fire Safety Guidelines for Train Journeys
తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెకర్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెకర్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

అలాగే రైలు బోగీల్లో ధూమపానం, బహిరంగ మంటలు పూర్తిగా నిషేధమని కూడా రైల్వే తెలిపింది. మొబైల్ ఛార్జింగ్ సాకెట్ల ద్వారా ఎలక్ట్రిక్ కెటిల్స్, హీటర్లు వంటి అనధికార విద్యుత్ పరికరాల వాడకంపైనా నిషేధం ఉందని పేర్కొంది. విద్యుత్ వైర్లు, ఫిటింగ్స్ లేదా ఇతర పరికరాలను తాకడం, వాటిలో మార్పులు చేయడం నిషిద్దమని తెలిపింది. అత్యవసర సమయాల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు వీలుగా డోర్లు, ఎమర్జెన్సీ ద్వారాల వద్ద ఖాళీ స్థలం ఉంచాలని కూడా సూచిస్తోంది. అలాగే రైల్వే స్టేషన్లలో సైతం ప్లాట్ ఫారాలు, వెయిటింగ్ హాల్స్, రైల్వే ప్రాంగణాల్లో కర్పూరం, హారతులు, కొవ్వొత్తులు లేదా ఇతర మండే పదార్ధాలు వెలిగించడం నిషిద్దమని తెలిపింది.

గుంటూరు జిల్లా నుంచి పంచారామాలు, త్రిశైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు- ఛార్జీలు ఇలా..!
గుంటూరు జిల్లా నుంచి పంచారామాలు, త్రిశైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు- ఛార్జీలు ఇలా..!

రైల్వే స్టేషన్లలో లేదా రైళ్ల సమీపంలో అగ్నితో కూడిన మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని హెచ్చరించింది. సిగరెట్లు, బీడీలు కాల్చడం, మండే వాటిని లేదా అగ్గి పుల్లల్ని రైల్వే ప్రాంగణాల్లో పారేయడం నిషిద్దమని తెలిపింది. ప్లాట్ ఫారాలపై వంటలు చేయడం లేదా బహిరంగ మంటలతో కూడిన కార్యకలాపాలు నిర్వహించకూడదని హెచ్చరించింది. తనిఖీలు చేసినప్పుడు సిబ్బందికి పూర్తిగా సహకరించాలని కూడా సూచిస్తోంది. రైల్లో మంటలు లేదా పొగ కనిపిస్తే అప్రమత్తమై రైలు మేనేజర్, టీటీఈ, ఆర్పీఎఫ్ లేదా విధుల్లో ఉన్న ఇతర రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరుతోంది. రైల్లో అగ్నిప్రమాదం జరిగితే అలారం చైన్ ఉపయోగించి రైలు ఆపాలని, అనంతరం ప్రమాద ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించింది. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రయాణికులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, కదిలే రైలు నుంచి ఎట్టి పరిస్ధితుల్లోనూ దూకరాదని తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే చట్టాల ప్రకారం గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+