గుంటూరు జిల్లా నుంచి పంచారామాలు, త్రిశైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు- ఛార్జీలు ఇలా..!
కార్తీక మాసం సందర్భంగా ఏపీలోని పంచారామాలకు, త్రిశైవక్షేత్రాలకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీ జిల్లా నుంచీ పంచారామాలకు, త్రిశైవ క్షేత్రాలకు ఆర్టీసీ (APSRTC) ప్రత్యేక బస్సుల్ని ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి, పొన్నూరు డిపోల నుంచి పంచారామాలకు, త్రిశైవక్షేత్రాలకు రాకపోకలు సాగించేలా ప్రత్యేక బస్సుల్ని అధికారులు ప్రకటించారు. ఈ బస్సుల సమయాలు, ఛార్జీలు, ఇతర వివరాలను ఓసారి తెలుసుకుందాం..
పంచారామాలతో పాటు త్రిశైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రజా రవాణాధికారి సామ్రాజ్యం తెలిపారు. జిల్లాలోని గుంటూరు 1, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోల నుంచి ఈ బస్సులు ప్రతీ శనివారం రాత్రి 9.30 గంటలకు, ఆదివారం రాత్రి 9.35 గంటలకు బయలుదేరుతాయని తెలిపారు. పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటతో పాటు త్రిశైవ క్షేత్రాలైన శ్రీశైలం, యాగంటి, మహానంది క్షేత్రాలకు కూడా బస్సులు ఏర్పాటు చేశారు.

బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్ల లోపు 30, అంత కంటే ఎక్కువ మంది భక్తులుంటే వారున్న ప్రాంతానికి ఈ ప్రత్యేక బస్సుల్ని పంపేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. గుంటూరు నుంచి పంచారామాలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు ఛార్జీని రూ.1160గా నిర్ణయించారు. అల్ట్రా డీలక్స్ అయితే రూ.1110గా నిర్ణయించారు. అలాగే తెనాలి నుంచి సూపర్ లగ్జరీ రూ.1200, అల్టా డీలక్స్ రూ.1150 ఛార్జీ ఉంటుంది. మంగళగిరి నుంచి అయితే సూపర్ లగ్జరీ రూ.1140, అల్ట్రా డీలక్స్ రూ.1090 ఉంటుంది. పొన్నూరు నుంచి అయితే సూపర్ లగ్జరీ రూ.1250, అల్ట్రా డీలక్స్ రూ.1200 ఉంటుంది.
అలాగే త్రిశైవ క్షేత్రాలకు అయితే గుంటూరు నుంచి సూపర్ డీలక్స్ రూ.1440, అల్ట్రా డీలక్స్ అయితే రూ.1380, తెనాలి నుంచి సూపర్ లగ్జరీ రూ.1540, అల్ట్రా డీలక్స్ 1480, మంగళగిరి నుంచి సూపర్ లగ్జరీ రూ.1450, అల్ట్రా డీలక్స్ రూ.1510, పొన్నూరు నుంచి సూపర్ లగ్జరీ రూ.1510, అల్ట్రా డీలక్స్ రూ.1450 ఛార్జీ ఉంటాయి.














Click it and Unblock the Notifications
