కాకినాడ కూటమిలో జడ్పీ ఛైర్ చిచ్చు- అలిగి, ప్రమాణానికీ దూరంగా టీడీపీ వైస్ ఛైర్మన్..!

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కూటమిలో ఉన్న గ్యాప్ ను బయటపెట్టాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాత పదవుల పంపకాల్లో పలు చోట్ల వివాదాలు తలెత్తుతున్నాయి. ఇదే కోవలో కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ (Kakinada ZP Chairperson) సీటు వివాదం జనసేన, టీడీపీ మధ్య గ్యాప్ పెంచుతోంది. కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా కాకినాడ జడ్పీ ఛైర్ పర్సన్ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో ఈ సీటుపై ఆశ పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే తాను పోటీ చేసి గెలిచిన జడ్పీటీసీగానూ ప్రమాణస్వీకారానికి నిరాకరిస్తున్నారు.

ఆ మేయర్ సీటు వైసీపీ ముందే గెలిచేసిందా ?- టీడీపీ సర్వేయర్ హింట్..!
ఆ మేయర్ సీటు వైసీపీ ముందే గెలిచేసిందా ?- టీడీపీ సర్వేయర్ హింట్..!

కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సీటు కోసం టీడీపీ, జనసేన నేతలు పోటీపడ్డారు. జిల్లాలో ఎక్కువ జడ్పీటీసీలు గెల్చుకున్న టీడీపీని కాదని జనసేనకు ఈ సీటును సీట్ల సర్దుబాట్లలో భాగంగా కేటాయించారు. దీంతో ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి అసంతృప్తికి లోనయ్యారు. ఇవాళ జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఆమె జడ్పీ సమావేశానికి హాజరైనా అసంతృప్తితో తిరిగి వెళ్లిపోయారు.

Kakinada ZP Chairperson Row TDP ZPTC Pilli Ananta Lakshmi Skips Oath-Taking
పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!
పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!

దీంతో రంగంలోకి దిగిన టీడీపీ ఎంపీ సాన సతీష్ బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్.. పిల్లి అనంత లక్ష్మిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కూటమి నాయకత్వం నిర్ణయాన్ని గౌరవించాలని ఆమెను కోరారు. దీంతో సరేనంటూ జడ్పీ సమావేశానికి వచ్చిన ఆమె.. కాసేపు కూర్చొన్న తర్వాత జడ్పీటీసీగా ప్రమాణస్వీకారం చేయకుండానే వెనుదిరిగారు. కూటమి నేతలు వారిస్తున్నా వినకుండా పిల్లి అనంతలక్ష్మి వెళ్లిపోయారు. ఛైర్ పర్సన్ సీటు తనకు ఇవ్వాల్సిందేనని ఆమె పట్టుబడుతున్నారు. కూటమి ధర్మం పేరుతో వైస్ ఛైర్ పర్సన్ సీటు తీసుకునేందుకు ఈ మాజీ ఎమ్మెల్యే నిరాకరిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో కూటమి పార్టీల రాష్ట్ర నాయకత్వాలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+