ఏపీలో స్థానిక ఎన్నికలపై సుబ్రమణ్య స్వామి సంచలనం..!!
మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన ట్వీట్ చేసారు. ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తీరు పైన ఆయన స్పందించారు. ఏపీలో పరిణామాల పైనా వ్యాఖ్యలు చేసారు. ఏపీలో రూల్ ఆఫ్ లా స్థానంలో జంగిల్ రాజ్ నడుస్తుందా అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాల పైన సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. తాను ఎన్నికల నిబంధనల పైన కోర్టుకు వెళ్తానని వెల్లడించారు.
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఘటనల పైన మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేసారు. స్థానిక ఎన్నికల ఘటలను ప్రస్తావించారు. స్వేచ్ఛాయుతమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాదిగా పేర్కొన్నారు. రాజకీయ, అధికార ప్రయోజనాల కోసం..ప్రజాస్వామ్య పునాదులను బలి చేయొద్దని సుబ్రహ్మణ్యస్వామి సూచించారు. ఎన్నికల సమగ్రతను, పారదర్శకతను కాపాడాలని ఆకాంక్షించారు. ఎన్నికల కోసం కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతూ తాను ఇక కోర్టును ఆశ్రయించబోతున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి వెల్లడించారు.

ఎన్నికల నిర్వహణ సమయం లో చోటు చేసుకున్న ఆందోళనలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కాగా, ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎక్స్ ద్వారా సుబ్రమణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేసారు.
కాగా, మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. ఏకగ్రీవాల పైన వైసీపీ కోర్టుకు వెళ్లింది. వైసీపీ పిటీషన్ ను విచారణ చేసిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసింది. వైసీపీ అభ్యంతరాల పైన పరిశీలన చేసి తిరిగి నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని నిర్దేశించింది. ఎన్నికల సంఘం కొన్ని ప్రాంతాల్లో రీ నామినేషన్ కు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
Under CM Naidu, the Andhra Pradesh Government must answer for the serious concerns surrounding the conduct of these Municipal elections. Is Jungle Raj replacing the rule of law? Has democracy itself been put to death in Andhra Pradesh?Free and fair elections are the bedrock of democracy. They cannot be sacrificed at the altar of political power. I intend to approach the Court seeking stringent and enforceable guidelines to safeguard the integrity of elections.
— Subramanian Swamy (@Swamy39) November 13, 2026
కాగా.. పులివెందులలో పోలింగ్ రోజున మాజీ సీఎం జగన్ తమ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించ కుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ ధర్నాకు దిగారు. పులివెందులలో కౌంటింగ్ కు అనుమతి ఇవ్వద్దని హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డి పిటీషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. ఇక, ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. తాజాగా సుబ్రమణ్య స్వామి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తి కర చర్చగా మారుతోంది.














Click it and Unblock the Notifications
