తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెకర్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
ఏపీలో అత్యంత కీలకమైన రెండు స్టేషన్లు తిరుపతి, విశాఖపట్నం మధ్య నడిచే డబుల్ డెకర్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్. గత కొంతకాలంగా ఈ రైలులో ప్రయాణిస్తున్నవారు నరకం చవి చూస్తున్నారు. దీనికి కారణం తుప్పుపట్టి పోయిన, విరిగిపోయిన కోచ్ లు, వాటి స్ధానంలో అమర్చిన కొన్ని సాధారణ బోగీలు.. ఇలా రైలు లుక్కే మారిపోయింది. దీంతో పాటు ఈ రైల్లో ప్రయాణికులకు ఆరంభంలో దొరికిన అనుభూతి కూడా దొరకడం లేదు. దీంతో ఈ రైలు ఎక్కే వారి సంఖ్య తగ్గిపోతోంది.
ఈ నేపథ్యంలో రైల్వే శాఖ దీనిపై ఫోకస్ పెట్టింది. తిరుపతి-విశాఖపట్నం వంటి కీలకమైన మార్గంలో రాకపోకలు సాగిస్తున్న ఈ డబుల్ డెకర్ ఎక్స్ ప్రెస్ రైలుకు (Tirupati-Vizag Double-Decker Express) కొత్త బోగీలు అమర్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రైలు కొన్ని డబుల్ డెకర్ బోగీలు, మరికొన్ని సాధారణ కోచ్ లతో ప్రయాణాలు సాగిస్తోంది. దీంతో ఇప్పుడు అవన్నీ మార్చేసి యూనిఫామ్ గా ఆన్నీ డబుల్ డెకర్ బోగీలు అమర్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పంజాబ్ లోని కపుర్తలా రైల్వో కోచ్ ఫ్యాక్టరీ నుంచి కొత్త బోగీల్ని రప్పిస్తోంది.

తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెకర్ రైలుకు మొత్తం 9 డబుల్ డెకర్ బోగీలు ఉండాలి. ఆరంభంలో ఇవన్నీ కొత్తగా ఉంటూ ప్రయాణికులకు ఓ సరికొత్త అనుభూతి పంచేవి. ఇప్పుడు కాలక్రమేణా అవి పాడైపోయినా మార్పులు చేయకపోవడంతో ప్రయాణికులు ఈ రైలు ఎక్కేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో త్వరలోనే కొత్త బోగీలు అమర్చి ఈ రైలును నడపాలని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త బోగీల అమరిక తర్వాత ఈ డబుల్ డెకర్ రైలు ప్రయాణం మునుపటి లాగే ఎంతో హాయిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ కొత్త బోగీలు ఎప్పుడు వస్తాయోనని ప్రయాణికులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.














Click it and Unblock the Notifications
