స్పేస్ సెక్టార్‌గా తిరుపతి.. ఏకంగా రూ.1.41 లక్షల కోట్లు!

విశాఖపట్టణంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు సరికొత్త ఘట్టానికి వేదికైంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు భారీ ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏపీసీఆర్డీఏ, ఏపీ మారిటైమ్ బోర్డు, ఐటీ ఎలక్ట్రానిక్స్, ప్రతిష్టాత్మక పీ4 (P4) రంగానికి సంబంధించి రూ.1.14 లక్షల కోట్ల విలువైన 12 ప్రధాన ఒప్పందాలు జరిగాయి. మొత్తం 11 ఎంఓయూలు, ఒక జీవో జారీ ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.1,41,585 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా 10,919 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఏపీలో పారిశ్రామిక ప్రభంజనం.. భారీ పెట్టుబడులు!

వివిధ రంగాలలో పెట్టుబడులకు పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వచ్చాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో మైనింగ్ కార్యకలాపాల కోసం హిందాల్కో గ్రూప్ రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనిద్వారా 2,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అలాగే తిరుపతి జిల్లాలో ఆర్బిటల్ డేటా సెంటర్, రాకెట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అగ్నికుల్ కాస్మోస్ లిమిటెడ్ రూ.510 కోట్ల పెట్టుబడితో ఒప్పందం చేసుకోగా, 350 మందికి ఉపాధి కలగనుంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హాథోర్ రాకెట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.250 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.

Andhra Pradesh Signs MoUs Worth Rs 1 41 Lakh Crore on Day 2 of CII Summit in Visakhapatnam Today

పునరుద్ధరణీయ ఇంధన రంగంలో గ్రీన్ జెన్ రెన్యూబుల్ ఎనర్జీ రూ.8,000 కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.6,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 1400 మెగావాట్ల డేటా సెంటర్, టెలికాం సెంటర్ల ఏర్పాటుకు ఎయిర్ ట్రంక్ ఇండియా-జేసీకే ఇన్ఫ్రా సంస్థలు ఏకంగా రూ.1,03,018 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేలా ఐటీ విభాగంతో ఒప్పందం చేసుకుని 3,120 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. డిక్సన్ టెక్నాలజీస్ రూ.700 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ రూ.6,452 కోట్ల పెట్టుబడితో 852 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులను చేపట్టనున్నాయి. వీటితో పాటు అమరావతి పరిధిలో ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ రూ.175 కోట్ల పెట్టుబడితో 150 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకుంది.

సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు

పేదరికంపై పీ4 యుద్ధం.. కార్పొరేట్ సంస్థల తోడ్పాటు

రాష్ట్రంలో అత్యంత పేద కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రారంభించిన ప్రతిష్టాత్మక పీ4 (పీపుల్, ప్రైవేట్, పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్) కార్యక్రమానికి బహుళజాతి సంస్థల మద్దతు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లోని 1120 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు 'బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ స్కాలర్‌షిప్' ద్వారా రూ.32.48 కోట్ల ఆర్థిక సహకారం అందించేందుకు హీరో మోటార్స్ కార్పొరేషన్, స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మరొకవైపు, రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామాల్లోని 25 వేల 'బంగారు కుటుంబాలను' దత్తత తీసుకుని, వారి జీవనోపాధి, జీవన ప్రమాణాలు పెంచే బాధ్యతను ఐటీసీ లిమిటెడ్ చేపట్టింది.

ఒప్పందాలు కాగితాలకే పరిమితం కావొద్దు: సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. కేవలం ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత కాలంలో సెమీకండక్టర్లు, ఏఐ, క్వాంటం, ఏరోస్పేస్ వంటి రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ఏపీని ప్రయోగశాలగా మలుచుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల వంటి విద్యాసంస్థలను పిలిచారు. తిరుపతి వద్ద స్పేస్, డిఫెన్స్ రంగాల పరిశ్రమల కోసం 5 వేల ఎకరాలు సిద్ధంగా ఉంచామని వెల్లడించారు.

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా ఫ్లైట్- 100 ఎయిర్ పోర్టులు- రామ్మోహన్ ప్రకటన..!
రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా ఫ్లైట్- 100 ఎయిర్ పోర్టులు- రామ్మోహన్ ప్రకటన..!

సంపద సృష్టితోనే దేశం, సమాజం అభివృద్ధి చెందుతాయని, ఆ సృష్టి ద్వారా వచ్చే ప్రతిఫలాలు పేదలకు అందినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు. ఇటీవల 'ఒపీ జిందాల్ యూనివర్సిటీ యాక్సెస్ టూ ఈక్వాలిటీ ఇండెక్స్'లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలవడం మన పాలనా విధానానికి నిదర్శనమన్నారు. కుప్పంలో టీవీఎస్ కంపెనీ ఒక ఇటుకబట్టీ మహిళకు చేయూతనిచ్చి యజమానిగా మార్చిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, అలాంటి విజయావకాశాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబం హ్యాపీగా, హెల్దీగా, వెల్దీగా ఉండాలన్నదే తన నిరంతర తాపత్రయమని సీఎం పునరుద్ఘాటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+