విశాఖపట్నం-గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ సూపర్ ఫాస్ట్ రైళ్ల నంబర్లు మార్పు

దక్షిణ కోస్తా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే పలు కీలక రైళ్ల నంబర్లు, కేటగిరీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు సూపర్ ఫాస్ట్ రైళ్లను సాధారణ ఎక్స్‌ప్రెస్ కేటగిరీలోకి మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మార్పులు జనవరి మొదటివారం నుంచి అమలులోకి రానున్నాయి. విశాఖపట్నం, గుంటూరు, కాచిగూడ, చర్లపల్లి వంటి ప్రధాన ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

రైల్వే సర్వీసుల వేగం, సమయపాలనను పునఃసమీక్షించిన అనంతరం ఈ కేటగిరీ మార్పులను చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల నంబర్లు మారడం వల్ల ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి అయోమయానికి గురికాకూడదని కోరారు. విశాఖపట్నం నుంచి అమృతసర్, గుంటూరు నుంచి వికారాబాద్, కాచిగూడ నుంచి కుంటా వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు నూతన నంబర్లు కేటాయించారు.

Railways announced Revision of several express train Numbers and Categories with effect from January 1

ఈ కేటగిరీ మార్పుల వల్ల రైళ్ల నంబర్లే కాకుండా సూపర్‌ఫాస్ట్ ఛార్జీలకు సంబంధించి ప్రయాణికులకు కొంతవరకు సడలింపు లభించే అవకాశం ఉంది. నూతన రైలు నంబర్లను తెలుసుకోవడం వల్ల ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్‌లో బుకింగ్ చేసుకోవడం ప్రయాణికులకు సులువవుతుంది. స్టేషన్లలో డిస్‌ప్లే బోర్డులు, ఆడియో అనౌన్స్‌మెంట్ల ద్వారా కూడా ప్రయాణికులకు ముందస్తు సమాచారం అందించనున్నారు.

పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం
పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం
  • విశాఖపట్నం - అమృతసర్ సూపర్ ఫాస్ట్ నంబర్ 20807 జనవరి 1 నుంచి 18513 గా మారనుంది. ఇకపై ఇది ఎక్స్ ప్రెస్ గా అందుబాటులో ఉంటుంది.
  • విశాఖపట్నం - గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ నంబర్ 22875 జనవరి 1 నుంచి 18531 గా మారుతుంది.
  • నరసాపూర్ - నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ నంబర్ 12787 జనవరి 2 నుంచి 17241 గా మారనుంది.
  • గుంటూరు - వికారాబాద్ ఎక్స్‌ప్రెస్ నంబర్ 12747 జనవరి 1 నుంచి 17349 అందుబాటులో ఉంటుంది.
  • 12789 కాచిగూడ - కుంటా ఎక్స్‌ప్రెస్ నంబర్ జనవరి 2 నుంచి 17689 గా మారుతుంది.
  • 15673 చర్లపల్లి - కామాఖ్య ఎక్స్‌ప్రెస్ జనవరి 6వ తేదీ నుంచి 17083 మారుతుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+