స్టాక్ మార్కెట్లోకి ఏపీ ప్రభుత్వ కార్పోరేషన్..! చంద్రబాబు కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్ద (AP Mineral Development Corporation) ను స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే త్వరలో ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!
పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!

జాతీయ ఖనిజాభివృద్ది సంస్థ (NMDC) తరహాలో APMDCని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ అధికారుల్ని ఆదేశించారు. ఇందుకోసం ప్రైవేట్ ఏజెన్సీల సాయం తీసుకోవాలన్నారు. గనుల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం.. రాష్ట్రంలో కొత్త ఖనిజ నిక్షేపాల గుర్తింపు, సమర్ధ వినియోగం, ఆదాయార్జన అవకాశాలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో ఖనిజ వనరుల విలువ పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మన వనరులు మన రాష్ట్రంలోనే వినియోగంలోకి తెచ్చేలా ప్రయత్నించాలని కోరారు. ఖనిజ వనరులను కేవలం ఆదాయార్జనగా చూడకుండా, భవిష్యత్ ఆస్తిగా మార్చడమే లక్ష్యం కావాలన్నారు.

AP Mineral Development Corporation IPO by 2027 Chandrababu Directs Officials to Speed Up Preparations
కాకినాడ కూటమిలో జడ్పీ ఛైర్ చిచ్చు- అలిగి, ప్రమాణానికీ దూరంగా టీడీపీ వైస్ ఛైర్మన్..!
కాకినాడ కూటమిలో జడ్పీ ఛైర్ చిచ్చు- అలిగి, ప్రమాణానికీ దూరంగా టీడీపీ వైస్ ఛైర్మన్..!

రాష్ట్రంలో 74,860 చ.కి.మీ. పరిధిలో మొత్తం 582 మినరల్ పొటెన్షియల్ ఏరియాలు గుర్తించి, 209 క్లస్టర్లుగా విభజించినట్టు చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది డిసెంబర్ లక్ష్యంగా ఏపీఎండీసీని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేలా ఐపీఓ కార్యాచరణ ప్రతిపాదనలకు సీఎం అంగీకరించారు. ఏపీఎండీసీ ఈక్విటీ విలువ ఆధారంగా ఐపీవోకు వెళ్లేలా చూడాలన్నారు. ఖనిజ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APREDC) ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణ, వాటికి విలువ పెంచడమే లక్ష్యం కావాలన్నారు. వచ్చే ఐదేళ్లలో ఖనిజ అన్వేషణ, వేలం ప్రక్రియ వేగవంతం చేసేలా ప్రణాళిలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న 6,500 క్వారీ లీజు దరఖాస్తులు, 223 రెన్యువల్స్ పరిష్కారానికి గడువు పొడిగింపు ప్రతిపాదనలపైనా చర్చించారు. వీటి పరిష్కారంతో ప్రభుత్వానికి రూ.400 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా కోసం ఒడిశా, జార్ఖండ్‌లో మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+