తిలక్ వర్మ, కుశాగ్ర సెంచరీలతో ఊచకోత.. నేపాల్‌పై భారత్ దండయాత్ర!

India A vs Nepal: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో నేపాల్‌తో జరుగుతున్న నాలుగో మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర అద్భుత సెంచరీలకు తోడు ఆఖర్లో యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గే మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్-ఏ 332 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

ఆడకుండానే పాకిస్థాన్‌కు ట్రోఫీ.. భారత్ షాకింగ్ నిర్ణయం!
ఆడకుండానే పాకిస్థాన్‌కు ట్రోఫీ.. భారత్ షాకింగ్ నిర్ణయం!

42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో..
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన భారత్-ఏకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ(9), వైభవ్ సూర్యవంశీ(26), ఆయుష్ బదోని(2) విఫలమవడంతో జట్టు కేవలం 42 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

India A vs Nepal Tilak Varma Kumar Kushagra Smash Centuries as India Post 332 in Asia Cup Details

ఆదుకున్న తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర
ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నేపాల్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ నాలుగో వికెట్ కు 206 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కుమార్ కుశాగ్ర 102 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 117 పరుగులు చేయగా.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 113 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 107 పరుగులు సాధించాడు.

టెస్టులకు ముందు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత!
టెస్టులకు ముందు టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. మ్యాచ్ ఫీజులో 35 శాతం కోత!

చివర్లో సూర్యాంశ్ షెడ్గే మెరుపులు
సెంచరీ వీరులిద్దరూ ఔటయ్యాక చివర్లో వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో భారత్-ఏ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే యువ బ్యాటర్ సూర్యాంశ్ షెడ్గే క్రీజులోకి వచ్చి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 14 బంతుల్లోనే 36 పరుగులు బాది జట్టు స్కోరును 330 మార్కు దాటించాడు. తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర వేసిన బలమైన పునాదిని సూర్యాంశ్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో సద్వినియోగం చేసుకోవడంతో నేపాల్ ముందు భారత్-ఎ 333 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+