ఆడకుండానే పాకిస్థాన్‌కు ట్రోఫీ.. భారత్ షాకింగ్ నిర్ణయం!

క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మరోసారి తీవ్ర వివాదం రాజుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా శుక్రవారం జరగాల్సిన పురుషుల అంధుల క్రికెట్ ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయినప్పటికీ నిర్వాహకులు పాకిస్థాన్‌ను ఏకైక విజేతగా ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ భారత బ్లైండ్ క్రికెట్ జట్టు ట్రోఫీ ప్రెజెంటేషన్ వేడుకను బహిష్కరించింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు షాక్.. దేశంలోనే నంబర్ 1 బ్రాండ్‌గా ఎయిర్‌టెల్!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు షాక్.. దేశంలోనే నంబర్ 1 బ్రాండ్‌గా ఎయిర్‌టెల్!

అసలేం జరిగిందంటే?
నవంబర్ 20న ఢాకాలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా స్టేడియం చిత్తడిగా మారింది. కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి నెలకొనడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. కానీ మ్యాచ్ రెఫరీ మాత్రం మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా పాకిస్థాన్‌ను టోర్నీ విజేతగా ప్రకటించారు. ఈ నిర్ణయంపై భారత ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్ ఆడకుండానే పాకిస్థాన్‌ను ఛాంపియన్‌గా ప్రకటించడాన్ని అంగీకరించని భారత జట్టు.. అవార్టుల ప్రదానోత్సవానికి దూరంగా ఉండి తమ నిరసన తెలిపింది.

Blind Cricket Asia Cup 2026 India Boycotts Ceremony as Pakistan Named Winner Without Play Full Details

నిబంధనలకు విరుద్ధమన్న క్యాబీ
ఈ వివాదంపై 'క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా'(CABI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌ను ఏకైక విజేతగా ప్రకటించే నిర్ణయాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. "వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయినప్పుడు ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలి. పాకిస్థాన్‌కు ఒక్కదానికే ట్రోఫీ ఇవ్వడం పూర్తిగా తప్పు" అని క్యాబీ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

అమరావతిలో స్పోర్ట్స్ అకాడమీ - లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యంతో లోకేష్ చర్చలు..!!
అమరావతిలో స్పోర్ట్స్ అకాడమీ - లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యంతో లోకేష్ చర్చలు..!!

నిబంధనలు ఏం చెబుతున్నాయి?
టోర్నమెంట్ సాంకేతిక నిబంధనలలోని సెక్షన్ 27ను క్యాబీ పేర్కొంటూ.. ఫైనల్ మ్యాచ్ రద్దయినా లేదా టై అయినా ఇరు జట్లను విజేతలుగా ప్రకటించే వెసులుబాటు ఉందని పేర్కొంది. ఇదే విషయాన్ని వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ సాంకేతిక కమిటీ దృష్టికి తీసుకెళ్లామని.. తొలుత కమిటీ కూడా సంయుక్త విజేతలుగా ప్రకటించేందుకు అంగీకరించిందని క్యాబీ తెలిపింది. అయినప్పటికీ చివరి నిమిషంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై క్యాబీ మండిపడింది. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని భారత్, పాకిస్థాన్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+