సోనియా గాంధీ బయోపిక్‌లో ప్రపంచ అందగత్తె.. కానీ కథ అడ్డం తిరిగింది!

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇటీవల రాసిన తన ఆత్మకథ 'బిలాంగింగ్' పుస్తకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. అయితేఈ పుస్తకం రావడానికి సరిగ్గా 20 ఏళ్ల క్రితమే సోనియా గాంధీ జీవిత కథ ఆధారంగా ఓ భారీ బయోపిక్ తీసేందుకు సన్నాహాలు జరిగాయి. అంతే కాదు అందులో సోనియా పాత్ర కోసం ఇటలీకి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటి, ప్రపంచ అత్యంత అందమైన మహిళగా గుర్తింపు పొందిన మోనికా బెలూచిని కూడా ఎంపిక చేశారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆ ప్రాజెక్టు అటకెక్కింది. ఆనాటి ఆసక్తికర కథనమే ఇది.

OM Movie Review: ఓం రివ్యూ.. మమ్ముట్టి కూడా కాపాడలేకపోయాడా?
OM Movie Review: ఓం రివ్యూ.. మమ్ముట్టి కూడా కాపాడలేకపోయాడా?

మోనికా బెలూచి ఎంపిక.. కానీ లీగల్ నోటీసులుతో బ్రేక్!
2006 వేసవిలో సోనియా గాంధీ జీవిత కథతో 'సోనియా' అనే పేరుతో సినిమా తీయాలని అమెరికాలో స్థిరపడిన భారత సంతతి దర్శకుడు జగ్మోహన్ ముంధ్రా నిర్ణయించుకున్నారు. జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ రాసిన 'సోనియా: ఎ బయోగ్రఫీ' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావించారు. సోనియా గాంధీ లాగే ఇటలీలో జన్మించిన హాలీవుడ్ స్టార్ మోనికా బెలూచి ఇందులో కీలక పాత్ర పోషించేందుకు అంగీకరించారని నిర్మాత సునందా మురళీ మనోహర్ అప్పట్లో ప్రకటించారు. మరో 60 రోజుల్లో షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

Sonia Gandhi Biopic Why Hollywood Star Monica Bellucci Walked Out of the 2006 Film Project Details

అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపింది. సినిమాలో వాస్తవాలు వక్రీకరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ తర్వాత 2012లో మోనికా బెలూచి స్పందిస్తూ.. "సోనియా గాంధీ పాత్ర కోసం నన్ను సంప్రదించారు కానీ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో నేను తప్పుకున్నాను" అని పేర్కొన్నారు. నిర్మాత సునంద, దర్శకుడు జగ్మోహన్ ముంధ్రా మరణంతో ఆ సినిమా కల శాశ్వతంగా ఆగిపోయింది. అప్పట్లో ఆ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్, ప్రీతి జింటా పేర్లు కూడా వినిపించాయి.

శర్వానంద్ 'భోగి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..
శర్వానంద్ 'భోగి' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది..

తెలంగాణ నేత జగ్గారెడ్డి కొత్త ప్రకటన!
ఇప్పుడు 79 ఏళ్ల వయసులో సోనియా గాంధీ స్వయంగా తన ఆత్మకథ 'బిలాంగింగ్'ను నవంబర్ 10న విడుదల చేశారు. ఇప్పటికే ఈ పుస్తకం 2 లక్షలకు పైగా కాపీలు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ బుక్ ఆధారంగా తాను సినిమా నిర్మిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా ప్రకటించారు. తెలుగు, హిందీ సహా అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తామని, ఇది వ్యాపార చిత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించి, 2028 డిసెంబర్ 9న సినిమాను విడుదల చేస్తామని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

గతంలో తన గురించి ఎన్నో అవాస్తవాలు ప్రచారంలోకి వచ్చాయని, అసలు నిజం ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాసినట్లు సోనియా గాంధీ వెల్లడించారు. 2014లో యూపీఏ అధికారం కోల్పోయిన సమయంలో మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ బారు రాసిన పుస్తకాలు తీవ్ర దుమారం రేపాయి. 2004లో రాహుల్ గాంధీ భయపడటం వల్లే సోనియా ప్రధాని పదవిని వదులుకున్నారని నట్వర్ సింగ్ రాయగా, ప్రధాని కార్యాలయం (PMO) ఫైళ్లను సోనియా నియంత్రించారని సంజయ బారు ఆరోపించారు. సంజయ బారు రాసిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' 2019లో సినిమాగా కూడా వచ్చింది. ఆ ఆరోపణలన్నింటికీ తన తాజా పుస్తకం 'బిలాంగింగ్' ద్వారా సోనియా గాంధీ గట్టి సమాధానం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+