కొరుకుడుపడని కేఎల్ రాహుల్.. సూపర్ సెంచరీ: న్యూజిలాండ్ బేజార్

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరుగుతోన్న మొదటి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తడాఖా చూపాడు. సెంచరీ బాదాడు. 207 బంతుల్లో 8 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌ సాయంతో 103 పరుగులు చేశాడు. అతని ధాటికి భారత జట్టు భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతోంది. ఒక వికెట్ నష్టానికి 277 పరుగులు సాధించింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 107, దేవ్ దత్ పడిక్కల్ 71 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 368 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీమిండియా బ్యాటర్ల జోరు ఆరంభమైంది. జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ప్రారంభం నుంచీ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. వన్డే తరహాలో ధాటిగా ఆడిన జైస్వాల్ 89 బంతుల్లో16 పరుగులతో 85 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని స్థానంలో వచ్చిన పడిక్కల్ క్రీజ్ లో పాతుకుపోయాడు. దూకుడుగా ఆడుతున్నాడు.

KL Rahul scored his 13th Test century on Day 3 of the first Test match on New Zealand in Wellington

మరో ఎండ్ లో కేఎల్ రాహుల్ కు ఎదురనేదే లేకుండా పోయింది. మూడో రోజు కూడా బ్యాటర్లదే పెత్తనం కొనసాగింది. రెండో సెషన్ లో రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతని టెస్ట్ కేరీర్ లో 13వది. 2014లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రాహుల్.. కష్టతరమైన విదేశీ పిచ్ లపై నిలకడగా రాణిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీని అందుకున్నాడు.

తిరుపతిలో బ్రహ్మోత్సవాల సందడి
తిరుపతిలో బ్రహ్మోత్సవాల సందడి
  • ఈ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్‌లో పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డును సైతం సమం చేశాడు.
  • న్యూజిలాండ్ పిచ్‌పై కేఎల్ రాహుల్ ఇదే మొదటి సెంచరీ. అతని కేరీర్ లో మొత్తం 13 టెస్ట్ సెంచరీలు ఉండగా.. వీటిల్లో 10 విదేశీ గడ్డపైనే సాధించడం విశేషం. దీన్ని బట్టి చూస్తే విదేశీ పిచ్ లపై అతనికి ఏ స్థాయిలో పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు.
  • దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలన్నింటిపైనా టెస్ట్ సెంచరీ సాధించిన అయిదవ భారత బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో మహ్మద్ అజరుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు.
  • సేనా దేశాలు నాలుగింటిపైనా సెంచరీ చేసిన మొట్టమొదటి టీమిండియా ఓపెనర్‌గా రాహుల్ నూతన చరిత్ర సృష్టించాడు. ఆసియా క్రికెట్ చరిత్రలోనే పాకిస్తాన్‌ మాజీ స్టార్ సయీద్ అన్వర్ తర్వాత ఈ రికార్డు సాధించిన రెండో ఓపెనర్ రాహులే.
  • సేనా దేశాల్లో రాహుల్‌కు ఇది ఎనిమిదవ టెస్టు సెంచరీ.
  • సేనా దేశాలపై సచిన్ టెండూల్కర్- 17, విరాట్ కోహ్లీ- 12, రాహుల్ ద్రావిడ్- 10, సునీల్ గవాస్కర్- 8, కేఎల్ రాహుల్- 8 సెంచరీలు చేశారు.
  • మొత్తంగా సేనా దేశాలపై మహ్మద్ అజరుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, సయీద్ అన్వర్, యునిస్ ఖాన్, కుమార సంగక్కార మాత్రమే టెస్టుల్లో సెంచరీ చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+