తిరుపతిలో బ్రహ్మోత్సవాల సందడి

తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల గడువు దగ్గర పడుతోంది. డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచీ పద్మావతి అమ్మవారిని దర్శించడానికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లను చేపట్టింది. వాటన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తోంది.

తాజాగా టీటీడీ జేఈవో డాక్టర్ ఏ శరత్ ఈ ఏర్పాట్లను పరిశీలించారు. టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడితో కలిసి ఆయన తిరుచానూరులో పర్యటించారు. వాహన మండపం, ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూ లైన్లు, పద్మ పుష్కరిణిని పరిశీలించారు. పూడి రోడ్డులో భక్తులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న షెల్టర్లతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నవజీవన్ ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేయనున్న హోల్డింగ్ పాయింట్ల ఏర్పాట్లపై ఆరా తీశారు.

Tiruchanur decked up for the Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavaru from December 6 to 14

ఈ సందర్భంగా శరత్.. అధికారులకు పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ సిబ్బందికి సూచించారు. వాహన సేవలతో పాటు భక్తులందరికీ శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తి దర్శనం సజావుగా కల్పించేలా క్యూ లైన్లు, దర్శన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అన్నారు.

తిరుమలలో దినదినాభివృద్ధి: అన్నప్రసాదం విరాళాలు రూ. 3,100 కోట్లు పైమాటే
తిరుమలలో దినదినాభివృద్ధి: అన్నప్రసాదం విరాళాలు రూ. 3,100 కోట్లు పైమాటే

భక్తులకు మంచినీటి సరఫరా, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత, రవాణా తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. ఆలయంలో భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు. క్యూలైన్ లల్లో వేచివుండే భక్తులకు ఎప్పటికప్పుడు మంచినీరు, అల్పాహారాన్ని అందించాలని చెప్పారు.

ఎపిక్ రామాయణ వేవ్: ప్రధాని మోదీ కీలక నిర్ణయం
ఎపిక్ రామాయణ వేవ్: ప్రధాని మోదీ కీలక నిర్ణయం

అనంతరం ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్, టీటీడీ విజిలెన్స్ విభాగాల సమన్వయంతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రత్యేకించి.. పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోన్నట్లు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+