చంద్రబాబుతో ఆదినారాయణ రెడ్డి భేటీ, కీలక హామీ..!?

కడప జెడ్పీ సీటు వ్యవహారం ఆదినారాయణ రెడ్డి గుర్రుగా ఉన్నారు. తమకు కేటాయిస్తామని చెప్పి సీటు టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి కేటాయింపు పైన మండిపడ్డారు. తన సోదరుల కుమారుల తో కలిసి రాజీనామాకు సిద్దపడ్డారు. బీజేపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. బుజ్జగించినా ఆది వెనక్కు తగ్గలేదు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తరువాతనే నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. కాగా, శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. కీలక హామీ దక్కినట్లు ప్రచారం సాగుతోంది.

కడప జెడ్పీ సీటు పుత్తా నరసింహారెడ్డికి కేటాయించటంతో ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. తన సోదరుడి కుమారుడికి జెడ్పీ ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటం పైన బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేసారు. తన సోదరుల కుమారులతో కలిసి విజయవాడ కు చేరుకున్నారు. తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. దీంతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో సహా విష్ణు కుమార్ రాజు ఆదినారాయణ రెడ్డితో మాట్లాడారు. కూటమిలో సీట్ల సర్దుబాటు పైన తీసుకున్న నిర్ణయాలను వివరించారు. రాజీనామా వద్దని సూచించారు. అయినా.. ఒక దశలో ఆదినారాయణ రెడ్డి సోదురుల కుమారులు రాజీనామా చేస్తామని ప్రకటించారు. తాను సైతం వారికి మద్దతుగా నిలుస్తానని.. బీజేపీ జాతీయ నాయకత్వం తో చర్చించిన తరువాత తన తుది నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. తనకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదని స్పష్టం చేసారు.

షర్మిల పై ఇక నుంచి, పార్టీ నేతలకు జగన్ కీలక ఆదేశాలు...!!
షర్మిల పై ఇక నుంచి, పార్టీ నేతలకు జగన్ కీలక ఆదేశాలు...!!
bjp-mla-adinarayana-reddy-meets-cm-chandrababu-at-undavalli-camp-office-discussions-over-kadapa-zp

చంద్రబాబుతో సమావేశం వేళ

కాగా, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, తన సోదరుల కుమారులు చదిపిరాళ్ల రాజేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డిలతో కలిసి శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ముఖ్యమంత్రిని కలిశారు. కడప జడ్పీ పీఠాన్ని బీజేపీకి కేటాయించనందుకు ఆదినారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉండటంతో చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. సీట్ల సర్దుబాటులో ఈ జడ్పీని బీజేపీకి ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి ఆయనకు చెప్పారు. కడప జిల్లా స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి తాను కృషి చేశానని.. అయితే వంద శాతం విజయం సాధించినా కూటమి నాయకుల తీరు బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కృషిని గుర్తించకుండా జడ్పీ చైర్మన్‌ పదవి విషయంలో కూటమి పెద్దల తీరు తీవ్రంగా బాధించిందన్నారు. పులివెందులలో సైతం కూటమి విజయానికి కృషి చేశానని చెప్పుకొచ్చారు. అయితే, భవిష్యత్ లో కూటమి ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత దక్కుతుందని ఆదినారాయణ రెడ్డికి హామీ దక్కినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+