భారత్ లో డేటా సెంటర్ల నిర్మాణంపై డొనాల్డ్ ట్రంప్ బిగ్ చెక్

అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు భారత్ సహా.. ఇతర దేశాల్లో డేటా సెంటర్లను నిర్మించకుండా నిషేధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ విదేశాల్లో డేటా సెంటర్లు గానీ ఇతర టెక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్లు గానీ ఏర్పాటు చేస్తే వాటిపై అతి భారీస్థాయిలో పన్నుల బాదుడు ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం విశాఖపట్నం సహా దేశంలో మరికొన్ని చోట్ల డేటా సెంటర్ల నిర్మాణం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

క్వాడ్ సమ్మిట్, చైనా పర్యటన ముగించుకుని వాషింగ్టన్ కు చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నూతన విధానాన్ని ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలు శరవేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అమెరికన్ కంపెనీల భారీ పెట్టుబడులు దేశం దాటి బయటికి వెళ్లకుండా నిరోధించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

Donald Trump vows to stop US companies from building data centers abroad threatens tremendous tax

ఈ కీలక ప్రకటన చేయడానికి ముందు తన సొంత పాలనా యంత్రాంగానికి గానీ, అధికారులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ట్రంప్ స్వయంగా వ్యాఖ్యానించారు. విదేశాల్లో కాకుండా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లోనే డేటా సెంటర్ల నిర్మాణం జరగాలని, అందుకు కావలసిన విద్యుత్, స్థలం, ఇతర వసతులు తమ దేశంలో పుష్కలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. తమ హెచ్చరికలను ధిక్కరించి విదేశీ గడ్డపై పెట్టుబడులు పెట్టే టెక్ కంపెనీలు తీవ్ర ఆర్థిక పరిణామాలు, ఊహించని పన్నుల భారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు.

చైనా నుంచి రాగానే భారత్ పై డొనాల్డ్ ట్రంప్.. !!
చైనా నుంచి రాగానే భారత్ పై డొనాల్డ్ ట్రంప్.. !!

డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆల్ఫాబెట్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్ వంటి టాప్ అమెరికన్ ఐటీ సంస్థలను తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వాటిని ఆందోళనకు గురిచేస్తోన్నాయి. డేటా లోకలైజేషన్ కోసం భారత్ సహా వివిధ దేశాల్లో వేల కోట్ల డాలర్ల వ్యయంతో ఇప్పటికే భారీ డేటా సెంటర్లను నిర్మిస్తోన్నాయి. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం విధించబోయే ఈ అదనపు పన్నుల భారం దీన్ని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది.

కొరుకుడుపడని కేఎల్ రాహుల్.. సూపర్ సెంచరీ: న్యూజిలాండ్ బేజార్
కొరుకుడుపడని కేఎల్ రాహుల్.. సూపర్ సెంచరీ: న్యూజిలాండ్ బేజార్

విదేశాలకు వెళ్లే డేటా సెంటర్లను నిరోధించి అమెరికాలోనే వాటిని నెలకొల్పాలనే ట్రంప్ ఆలోచనకు సొంత దేశంలోనే స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటీవల సీఎన్‌బీసీ నిర్వహించిన ఆల్ అమెరికా ఎకనామిక్ సర్వే ప్రకారం తమ నివాస ప్రాంతాలకు 10 మైళ్ల పరిధిలో ఏఐ డేటా సెంటర్లను నిర్మించడాన్ని 64 శాతం మంది అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. 13 శాతం మంది మాత్రమే ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు.

భారత్ కు వచ్చిన పాకిస్తాన్ మంత్రి గొంతెమ్మ కోరికలపై తేల్చి చెప్పిన కేంద్రం
భారత్ కు వచ్చిన పాకిస్తాన్ మంత్రి గొంతెమ్మ కోరికలపై తేల్చి చెప్పిన కేంద్రం

ఈ భారీ డేటా సెంటర్ల నిర్మాణాల వల్ల విపరీతమైన విద్యుత్ వినియోగం, నీటి కొరత, శబ్ద కాలుష్యం పెరుగుతాయనే ఆందోళన ప్రజల్లో నెలకొని ఉంది. ప్రపంచ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆధిపత్యం సాధించడానికి చైనాతో పోటీపడుతోంది.. అమెరికా. షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన సదస్సులో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది. ఏఐలో అమెరికా సాధిస్తోన్న పురోగతి గురించి చర్చించినట్లు ట్రంప్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+