భారత్ కు వచ్చిన పాకిస్తాన్ మంత్రి గొంతెమ్మ కోరికలపై తేల్చి చెప్పిన కేంద్రం

ఢిల్లీలోని చారిత్రాత్మక ఓల్డ్ ఖిలా వేదికగా జరుగుతున్న షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సాంస్కృతిక సదస్సుకు హాజరైన పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ పర్యటనపై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. అధికారిక సమావేశాల మినహా దేశంలో మరే ఇతర ప్రదేశాలను కూడా సందర్శించడానికి అనుమతి లేదని తెలిపింది. ఈ మేరకు ముసాదిక్ మాలిక్ చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

దౌత్య నిబంధనల ప్రకారం ఎస్సీఓ కార్యక్రమాలకు మాత్రమే ఆయన పర్యటనను పరిమితం చేసింది. భారత్ పర్యటన సందర్భంగా ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్ మహల్‌, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని ముసాదిక్ మాలిక్ కోరినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సీఓ సమావేశ ప్రాంగణం దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేయట్లేదు. నిబంధనల ప్రకారం ఎస్సీఓ ప్రతినిధిగా మాత్రమే ఆయన పర్యటన కొనసాగుతుందని, వ్యక్తిగత సందర్శనలకు అనుమతి లేదని పేర్కొంది.

Centre denied permission to visit the Taj Mahal and Hazrat Nizamuddin Dargah to Pakistan Minister

నిజానికి.. ఈ ఎస్సీఓ సమ్మిట్ కు పాకిస్తాన్ మంత్రిని ఆహ్వానించడం పట్ల రాజకీయ దుమారం రేగింది. పహల్గామ్ ఘటన, దాని తదనంతర సైనిక చర్యల నేపథ్యంలో ఆయనను భారత్‌కు ఆహ్వానించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తోన్నాయి. సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్‌కు వ్యతిరేకంగా గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన మాలిక్ పర్యటనను పలు రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి.

తిరుప్పరంకుండ్రమ్ కొండపై కార్తీక దీపోత్సవానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ట్విస్ట్
తిరుప్పరంకుండ్రమ్ కొండపై కార్తీక దీపోత్సవానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ట్విస్ట్

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమావేశాల పరిధికి మించి ఎలాంటి మినహాయింపులు ముసాదిక్ మాలిక్ కు ఇచ్చే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్టయింది. దీంతో మాలిక్ ఆయన టీమ్ పర్యటన ఢిల్లీ ఎస్సీఓ సదస్సు ప్రాంగణానికి మాత్రమే పరిమితం కానుంది.

అయ్యప్ప మాల వేసుకున్నాడని ఆఫీస్ కు రానివ్వని టీసీఎస్ హైదరాబాద్
అయ్యప్ప మాల వేసుకున్నాడని ఆఫీస్ కు రానివ్వని టీసీఎస్ హైదరాబాద్

ఎస్సీఓ శాశ్వత సభ్యదేశంగా అంతర్జాతీయ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారమే పాకిస్తాన్‌కు ఆహ్వానం పంపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎస్సీఓ వంటి అంతర్జాతీయ వేదికలపై రీజినల్ కోఆపరేషన్ ను కొనసాగించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. గతంలో 2023లో గోవాలో జరిగిన ఎస్సీఓ సమావేశానికి పాక్ అప్పటి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరైన విషయాన్ని గుర్తు చేసింది. అలాగే.. ఇస్లామాబాద్‌లో జరిగిన సమావేశానికి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా హాజరయ్యారు.

కొంపముంచిన శుభ్‌మన్ గిల్ తొందరపాటు నిర్ణయాలు
కొంపముంచిన శుభ్‌మన్ గిల్ తొందరపాటు నిర్ణయాలు

భారత్‌కు చేరుకున్న అనంతరం ముసాదిక్ మాలిక్ మీడియాతో మాట్లాడారు. పొరుగుదేశాలతో అనేక అంశాలపై విస్తృతస్థాయి చర్చలు జరపడానికి ఇదొక అద్భుత అవకాశమని అభివర్ణించారు. సంస్కృతులు, నాగరికతలు భౌగోళిక సరిహద్దులకు అతీతంగా విస్తరించి ఉంటాయని, తమ ప్రాంతీయ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం గురించి ఇతర సభ్య దేశాలతో పంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+