షర్మిల పై ఇక నుంచి, పార్టీ నేతలకు జగన్ కీలక ఆదేశాలు...!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల తరువాత పూర్తి స్థాయిలో పార్టీ ప్రక్షాళనకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇంఛార్జ్ ల పని తీరు పైన నివేదికలు తెప్పించుకున్నారు. ఒన్ టు ఒన్ సమావేశాలకు నిర్ణయించారు. వచ్చే నెల తొలి వారం లో లండన్ పర్యటనకు వెళ్తున్న జగన్ వచ్చిన తరువాత తాడేపల్లి నుంచే పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించ నున్నారు. ఇదే సమయంలో సోదరి షర్మిల విషయంలో పార్టీ నేతలకు జగన్ చేసిన దిశా నిర్దేశం ఇప్పుడు కీలకంగా మారుతోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ లండన్ పర్యటన ఖరారైంది. ఇప్పటికే సీబీఐ కోర్టు షరతులతో విదేశీ పర్యటనకు జగన్ కు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5న కుటుంబ సమేతంగా లండన్ పర్యటన కు వెళ్తున్న జగన్.. తిరిగి 19న బెంగళూరు రానున్నారు. 23న తిరిగి పులివెందుల వెళ్లనున్నారు. క్రిస్మస్ తరువాత ఇక పూర్తి స్థాయిలో పార్టీ పైన ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారు. నియోజకవర్గ ఇంఛార్జ్ ల పని తీరు పైన అన్ని స్థాయిలో జగన్ నివేదికలు తెప్పించుకున్నారు. మొత్తం 175 నియోజకవర్గ ఇంఛార్జ్ లతో ఒన్ టు ఒన్ సమావేశాలకు సిద్దం అయ్యారు. సంక్రాంతి తరువాత ఇక తాడేపల్లిలోనే జగన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వారంలో రెండు పార్లమెంటరీ జిల్లా కేడర్ తో సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. జమిలి ఎన్నికల ప్రచారం వేళ పాదయాత్ర ను మార్చిలోనే ప్రారంభించేలా ఆలోచన చేస్తున్నారని సమాచారం.

జగన్ తాజా నిర్ణయాలతో
కాగా, తాజాగా షర్మిల పైన సాక్షిలో వచ్చిన కథనం రాజకీయంగా వివాదంగా మారింది. షర్మిల సైతం సోషల్ మీడియా వేదికగా జగన్ ను ప్రశ్నిస్తూ సాక్షిలో తన పైన వచ్చిన వార్త పైన నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు. కాగా.. పార్టీ ముఖ్య నేతలకు షర్మిల వ్యవహారం పైన కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. షర్మిల వ్యవహారంలో ఎవర స్పందించవద్దని తేల్చి చెప్పారు. షర్మిల పైన వచ్చిన కథనం పైనా జగన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో "మీరు ఎవరూ మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు" అని జగన్ ఖరా ఖండిగా చెప్పారు. షర్మిల చేస్తున్న ఆరోపణల పైన ఇప్పటి వరకు సజ్జలతో సహా పలువురు పార్టీ నేతలు అనేక సందర్భాల్లో స్పందించారు. ఇప్పుడు జగన్ నిర్ణయంతో ఇక ఎవరూ స్పందించే అవకాశాలు లేవని తెలుస్తోంది. అదే విధంగా సాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ.. .చేస్తున్న వ్యాఖ్యల పైన వైసీపీ మౌనం పాటిస్తోంది. దీంతో.. ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది.













Click it and Unblock the Notifications
