“కొనేదెలా” నాగేంద్రబాబు గారూ…! డెడ్ పార్టీ కామెంట్ కు వైసీపీ ఘాటు కౌంటర్..!

గత ఎన్నికల్లోనే వైసీపీ (YSRCP) చనిపోయిందని, ఆ పార్టీతో స్దానిక సంస్ధల ఎన్నికల్లో తమకు పోటీ ఏంటని జనసేన నేత నాగేంద్రబాబు చేసిన విమర్శ రాజకీయంగా కలకలం రేపింది. దీనిపై వైసీపీ ఘాటుగా స్పందించింది. పవన్ కళ్యాణ్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు పెట్టిన పార్టీలు, గత కొన్నేళ్లుగా చేసిన రాజకీయాల్ని గుర్తుచేస్తూ వైసీపీ నేత యనమల నాగార్జున యాదవ్ ఎక్స్ లో ట్వీట్ పెట్టారు. ఇందులో నాగేంద్ర బాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..! 3 వారాల డెడ్ లైన్..!
జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..! 3 వారాల డెడ్ లైన్..!

"కొనేదెలా" నాగేంద్రబాబు గారూ అంటూ ట్వీట్ ను వెటకారంగా మొదలుపెట్టిన యనమల నాగార్జున యాదవ్ .. మీ కుటుంబ రాజకీయాలది ఓ ప్రత్యేకమైన రికార్డు!, మీ కుటుంబం పెట్టిన మొదటి పార్టీ "ప్రజారాజ్యం"... తొలి ఎన్నికల్లోనే చచ్చిపోయింది!,
మీ కుటుంబం విలీనం చేసిన రెండో పార్టీ "కాంగ్రెస్"... ఆ తర్వాతి ఎన్నికల్లోనే చచ్చిపోయింది!, మీ కుటుంబం పెట్టిన మూడో పార్టీ "జనసేన"... తొలి ఎన్నికల్లోనే చచ్చిచెడి బ్రతికింది అంటూ వరుస పంచ్ లు వేశారు.

YSRCP Counters Nagababu s Dead Party Jibe Claims Jana Sena Has Faced Three Political Deaths
పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!
పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!

ఇప్పుడు నారా లోకేష్ గారు దయతలచి పోసిన "రాజకీయ తులసి నీళ్లతో" ఎలాగోలా మనుగడ సాగిస్తున్న జనసేనలో ఉంటూ... మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పిచ్చి ప్రేలాపనలు పేల్చడమా? అంటూ నాగబాబుకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. నాగేంద్రబాబుగారూ... మూడు పార్టీల రాజకీయ చరిత్రలో రెండు సమాధులు, మూడో పార్టీకి టీడీపీ ఆక్సిజన్! అన్నారు. ముందు మీ పార్టీ పరిస్థితి చూసుకోండి... ఆ తర్వాత మా పార్టీ గురించి మాట్లాడండి! అంటూ నాగబాబుకు నాగార్జున యాదవ్ చురకలు అంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+