జగన్ ఆస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..! 3 వారాల డెడ్ లైన్..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మధ్య జగన్ కేసుల్లో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. మరోవైపు ఈ కేసుల్ని త్వరగా తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ హైకోర్టు ఈ కేసుల వ్యవహారంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ కేసులు ఏ మలుపు తీసుకుంటాయో అన్న టెన్షన్ పెరుగుతోంది.

గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ అక్రమాస్తులు సంపాదించారంటూ దాఖలైన పలు కేసులు ఒక్కొక్కటిగా ఛార్జిషీట్ దశకు చేరుకుంటున్నాయి. అయితే సీబీఐ, ఈడీ ఈ కేసుల్లో దర్యాప్తు ఆలస్యం చేస్తున్నాయంటూ, వాటిని వేగంగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కాపు నేత హరిరామజోగయ్యతో పాటు మరికొందరు దాఖలు చేసిన ఈ పిటిషన్లు తాజాగా మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చాయి. దీనిపై స్పందించిన హైకోర్టు.. వాటి స్టేటస్ ఏంటని దర్యాప్తు సంస్థల్ని ప్రశ్నించింది. దీంతో ఈ కేసుల స్టేటస్ వివరాలు చెప్పేందుకు తమకు మూడు వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. వారికి మూడు వారాల గడువు ఇస్తూ.. అప్పటిలోగా ఈ కేసుల స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

YS Jagan s Disproportionate Assets Cases Telangana High Court Seeks Status Report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+