"ఆ మాత్రం తేడా తెలియదా ?"- జగన్ కు లోకేష్ ఘాటు కౌంటర్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఇచ్చిన వివరణకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. ఫీజుల బకాయిలపై జగన్ సంధించిన ప్రశ్నలకు లోకేష్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని జగన్‌కు ఆర్థిక సంవత్సరం, విద్యా సంవత్సరం మధ్య తేడా కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఏ త్రైమాసికంలో విడుదల చేశామన్నది ఒక అంశమైతే, ఆ నిధులు ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిల కోసం చెల్లించామన్నది మరో అంశమని లోకేష్ స్పష్టత ఇచ్చారు. ఈ రెండు అంశాలను కలిపి చూపిస్తూ జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఫీజులపై సర్కార్ లెక్క తప్పు?-కాగ్ రిపోర్ట్ బయటపెట్టిన జగన్..!
ఫీజులపై సర్కార్ లెక్క తప్పు?-కాగ్ రిపోర్ట్ బయటపెట్టిన జగన్..!

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం సుమారు రూ.3,000 కోట్లు విడుదల చేసినట్లు అసెంబ్లీలో వెల్లడించామని, ఆ ప్రకటనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ తెలిపారు. ఏ త్రైమాసికంలో ఎంత మొత్తం విడుదల చేశామన్న పూర్తి వివరాలను పట్టిక రూపంలో కూడా అందించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలు, సవరించిన కేటాయింపులు, వాస్తవ చెల్లింపుల మధ్య వ్యత్యాసం ఉంటుందని, నిధుల విడుదలకు అనుగుణంగా బడ్జెట్‌లో సర్దుబాట్లు జరుగుతాయని ఆయన వివరించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు ఈ విషయాలు తెలియకపోవడం విచారకరమన్నారు.

Nara Lokesh Hits Back at YS Jagan Over Fee Reimbursement Remarks
Ys Jagan: జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం- చాలా కాలం తర్వాత ఈడీ కీలక అడుగు..!
Ys Jagan: జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం- చాలా కాలం తర్వాత ఈడీ కీలక అడుగు..!

గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరిగేదని, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలోపే విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలలకు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని లోకేష్ గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చిందని, విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా నేరుగా కళాశాలలకే నిధులు చెల్లించే విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి నెలా రూ.200 నుంచి రూ.300 కోట్ల చొప్పున బకాయిలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ వీలైనంత త్వరగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని, రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా ఉపయోగించుకోవడం మానుకోవాలని
వైఎస్ జగన్ కు లోకేష్ హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+