జగన్ పాదయాత్ర ముహూర్తంలో మార్పు, ఢిల్లీ సంకేతాలతో ప్లాన్ ఛేంజ్..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాల ను సిద్దం చేస్తున్నారు. అవసరమైన నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్చటంతో పాటుగా పార్టీలో సమూల ప్రక్షాళనకు సిద్దం అవుతున్నారు. సంక్రాంతి నుంచి పూర్తి స్థాయిలో తాడేపల్లిలోనే పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా ఇప్పటికే చెబుతూ వస్తున్న పాదయాత్ర ముహూర్తం మారనుంది. ఢిల్లీ నుంచి అందుతున్న సంకేతాల మేరకు జగన్ తన కొత్త కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరిగి పాదయాత్ర పైన కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా పాదయాత్ర పైన ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే జగన్ తాను 2027 సెప్టెంబర్ లో పాదయాత్ర ప్రారంభిస్తానని.. దాదాపు ఏడాది కాలం కొనసాగుతుందని వెల్లడించారు. కాగా, తాజాగా జగన్ పాదయాత్ర ఆరు నెలలు ముందు గానే ప్రారంభం అవుతుందని సమాచారం. 2027 మార్చి లోనే జగన్ పాదయాత్ర ప్రారంభించి 2028 ఏప్రిల్ నాటికి పూర్తి చేసే ఆలోచనతో ఉన్నట్లుగా పార్టీ నేతల సమాచారం. ఇక, డిసెంబర్ తొలి వారంలో లండన్ పర్యటనకు వెళ్తున్న జగన్.. క్రిస్మస్ కు పులివెందుల వెళ్లనున్నారు. సంక్రాంతి నుంచి ఇక పూర్తి స్థాయిలోనే తాడేపల్లిలో అందుబాటులో ఉండేలా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మార్చి లోగా నియోజకవర్గాల వారీగా అందరితో ఒన్ టు ఒన్ సమావేశాలు నిర్వహించి.. ఈ రెండున్నారేళ్ల కాలంలో వారి పని తీరుపైన సేకరించిన రిపోర్ట్స్ ఆధారంగా చర్చించనున్నారు.

జగన్ కొత్త లెక్కలు
కాగా, నియోజకవర్గాల్లో కూటమి పార్టీల పరిస్థితితో పాటుగా.. వైసీపీ బలం- బలహీనత-అభ్యర్ధి పని తీరు పైన జగన్ నివేదికలు తెప్పించుకున్నారు. స్థానిక ఎన్నికల్లో వారి పని తీరును పరిగణలోకి తీసుకుంటున్నారు. అవసరమైన చోట ఇంఛార్జ్ లను మార్చి..వారికి పార్టీ బాధ్యతలను అప్పగించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ జిల్లాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ తరువాత మార్చిలో పాదయాత్ర ప్రారంభించేలా కొత్త కార్యాచరణ ఖరారు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు పాద యాత్ర ముహూర్తం మార్పు వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేంద్రం డీలిమిటేషన్ పైన ఆలో చన చేస్తూనే 2029 ఎన్నికల్లో జమిలి దిశగా ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా 2028 చివర్లో నే జమిలి జరిగే అవకాశం ఉందనేది ఢిల్లీ వర్గాల సమాచారం. దీని కారణంగానే జగన్ సైతం తన పాదయాత్ర ఆరు నెలలు ముందుగానే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో.. జగన్ తాజా నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
