నరేష్ - పవిత్రా లోకేష్ లగ్జరీ హౌస్ మొత్తం అరాచకమే
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరోసారి సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. దివంగత లెజెండరీ నటి, దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, ఒకప్పుడు లవర్ బాయ్ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
సినిమాలే కాకుండా తన వ్యక్తిగత జీవితం ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలిచే నరేష్, తాజాగా నటి పవిత్రా లోకేష్‌తో కలిసి హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించుకున్న అల్ట్రా-లగ్జరీ ఇంద్రభవనంలోకి అడుగుపెట్టారు. ఇటీవల అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ గృహప్రవేశ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు మురళీమోహన్, కమెడియన్ అలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలు, నరేష్ కొత్త ఇంటికి సంబంధించిన వీడియోలు గతంలో వైరల్ కాగా, ఇప్పుడు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇంద్రభవనాన్ని తలపించేలా ఇల్లు
హైదరాబాద్‌లో సుమారు ఐదు ఎకరాల విశాలమైన స్థలంలో ఈ విలాసవంతమైన భవనాన్ని నరేష్ నిర్మించుకున్నారు. గృహప్రవేశానికి వచ్చిన అతిథులకు ఆయనే స్వయంగా ఇల్లంతా తిప్పి చూపించారు. ఈ ఇంటికి సంబంధించిన ప్రత్యేకతలు చూసి సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారట. రాజసం ఉట్టిపడే ఎంట్రెన్స్, అత్యంత విశాలమైన మాస్టర్ బెడ్రూమ్లు, అత్యాధునిక వసతులతో కూడిన కిచెన్, ప్రత్యేక జిమ్ స్పేస్, పచ్చదనంతో కళకళలాడే ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్ ఈ ఇంటి ప్రత్యేకతగా నిలిచాయి. ముఖ్యంగా తన అభిరుచికి తగ్గట్టుగా వరాండాలో ఏర్పాటు చేసుకున్న భారీ వరల్డ్ మ్యాప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కోట్ల విలువైన ఆస్తులు
నరేష్ కొత్త ఇంటి నిర్మాణం, దాని లగ్జరీ హంగులు చూసిన నెటిజన్లు దీనికి ఎంత ఖర్చయి ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. నరేష్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా. కేవలం గచ్చిబౌలి సమీపంలోని విప్రో సర్కిల్ వద్ద విజయనిర్మలకు చెందిన ఐదు ఎకరాల ఫామ్‌హౌస్ విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందని సమాచారం. దీనికి తోడు మొయినాబాద్, శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో మరో 30 ఎకరాల విలువైన ఫామ్‌ల్యాండ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లగ్జరీ ఇంద్రభవనం, నరేష్ కొత్త జీవితానికి సంబంధించిన వార్తలు టాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.














Click it and Unblock the Notifications
