తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్- ఏ రోజు ఏ పరీక్ష ?

తెలంగాణ ఇంటర్ విద్యా బోర్డు ఇవాళ వచ్చే ఏడాది జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల (Telangana Inter Public Exams 2027)షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు వచ్చే ఏడాది రాసే పరీక్షలకు సంబంధించిన తేదీల్ని ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకూ రెండు సంవత్సరాల పరీక్షల్ని నిర్వహించబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, అలాగే ఫిబ్రవరి 25 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఇంటర్ బోర్డు రద్దు వెనుక అసలు కుట్ర ఇదేనా?.. కవిత సంచలన ఆరోపణలు!
ఇంటర్ బోర్డు రద్దు వెనుక అసలు కుట్ర ఇదేనా?.. కవిత సంచలన ఆరోపణలు!

ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఆదివారం కూడా పరీక్షలుంటాయి. అలాగే ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 11 నుంచి 18 వరకూ మూడు సెషన్లలో ఉంటాయి. అలాగే ఫస్టియర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జనవరి 29న, సెకండియర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జనవరి 30న ఉంటాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జనవరి 29న, ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 27న, ఫస్టియర్ ఇంటర్నల్ అసెస్ మెంట్ జనవరి 20 నుంచి 25 వరకూ ఉంటాయి. జనరల్, ఒకేషనల్ విద్యార్ధులకు సాధారణ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకూ ఉంటాయి. ప్రాక్టికల్స్ ఉదయం, సాయంత్రం ఉంటాయి.

Telangana Inter Public Exams 2027
గ్లోబల్ టాప్ 200లో చోటు దక్కించుకున్న భారతీయ ఐఐటీ- దేశంలో ఫస్ట్ ప్లేస్..!
గ్లోబల్ టాప్ 200లో చోటు దక్కించుకున్న భారతీయ ఐఐటీ- దేశంలో ఫస్ట్ ప్లేస్..!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫిబ్రవరి 24న సెకండ్ లాంగ్వేజ్, ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్, మార్చి 2న మ్యాథమెటిక్స్ పేపర్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, అకౌంటెన్సీ, మార్చి 5న మ్యాథ్స్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ, కామర్స్ పేపర్ 1, మార్చి 9న ఫిజిక్స్, ఎకనామిక్స్, మార్చి 15న కెమిస్ట్రీ,, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథమెటిక్స్ పేపర్ 1(ఎంఈసీ), మార్చి 19న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పరీక్షలు ఉంటాయి. అలాగే సెకండియర్ విద్యార్ధులకు ఫిబ్రవరి 25న సెకండ్ లాంగ్వేజ్, 27న ఇంగ్లీష్, మార్చి 3న మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, మార్చి 8న మ్యాథ్స్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ, మార్చి 12న ఫిజిక్స్, ఎకనామిక్స్, మార్చి 16న కెమిస్ట్రీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మార్చి 20న మోడ్రన్ లాంగ్వేజ్ పేర్ 2, జాగ్రఫీ, మ్యాథ్స్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+