కన్నీళ్లు ఆపుకోలేకపోయిన యోగి ఆదిత్యనాథ్
భావోద్వేగపూరక వాతావరణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రీ దేవి భౌతికకాయానికి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ పౌడీ గఢ్వాల్ జిల్లా పంచూర్ లో శనివారం ఉదయం ఆమె పార్థివదేహానికి పలువురు నివాళి అర్పించారు. కన్నీటి వీడ్కోలు పలికారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు కేంద్ర, రాష్ట్రమంత్రులు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.
తల్లి అంత్యక్రియాలను నిర్వహించడానికి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం సాయంత్రం పంచూర్ కు చేరుకున్నారు. ఈ ఉదయం అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె భౌతికకాయానికి చివరిసారి నివాళి అర్పించిన అనంతరం అంతిమయాత్ర ఆరంభమైంది. పాడె మోసి తల్లి రుణం తీర్చుకున్నారు.

వయో సంబంధిత అనారోగ్య కారణాలతో 91 ఏళ్ల సావిత్రీ దేవి శుక్రవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం పంచూర్ గ్రామం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర హరిద్వార్‌లోని చండీఘాట్‌కు చేరుకుంది. అక్కడ కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, స్థానికుల సమక్షంలో అంతిమ సంస్కారాలు శాస్త్రోక్తంగా పూర్తయ్యాయి. అంత్యక్రియలు పూర్తయిన అనంతరం యోగి ఆదిత్యనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇతర క్రియా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆయా క్రతువులు ముగిసిన వెంటనే యోగి ఆదిత్యనాథ్ తిరిగి తన పరిపాలనా బాధ్యతల్లో నిమగ్నం కానున్నారు. ఈ మధ్యాహ్నం 2:15 నిమిషాలకు ఉత్తరాఖండ్ నుండి బయలుదేరి సాయంత్రానికి లక్నో చేరుకోనున్నారు. లక్నోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరగనున్న కౌశల్ దీక్షాంత్ సమారోహ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
యోగి ఆదిత్యనాథ్ కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు పలువురు నాయకులు హరిద్వార్‌కు తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలు అపర్ణా యాదవ్, ఆమె తండ్రి అరవింద్ సింగ్ బిష్త్, మంత్రులు దినేష్ ప్రతాప్ సింగ్, సతీష్ శర్మ ప్రత్యేక విమానంలో ఉత్తరాఖండ్ చేరుకుని యోగిని పరామర్శించారు. గోరఖ్‌నాథ్ లో ప్రత్యేక సంతాప సభలు జరిగాయి. ఆ ఆలయ అధికారులు, మహారాణా ప్రతాప్ శిక్షణ పరిషత్ సభ్యులు సంతాప సభ నిర్వహించి సావిత్రీ దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
नास्ति मातृसमा छाया नास्ति मातृसमा गतिः।नास्ति मातृसमं त्राणं नास्ति मातृसमा प्रिया॥🙏 https://t.co/usBszRtWjQ
— Yogi Adityanath (@myogiadityanath) November 21, 2026













Click it and Unblock the Notifications
