దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభ ముహూర్తం ఫిక్స్- రూట్ ఖరారు, ప్రత్యేకతలు..!!

రైల్వే వ్యవస్థలో మరో అరుదైన ఘట్టం. తొలి స్వదేశీ బుల్లెట్ రైలు పట్టాలెక్కేందుకు సిద్దమైంది. గంటలకు 280 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యం కలిగిన ఈ రైలు కోసం ప్రత్యేకంగా ట్రాక్ సిద్దం చేసారు. తొలి రైలు మార్గం ఫిక్స్ అయింది. దశల వారీగా దేశ వ్యాప్తంగా విస్తరించేలా ప్రణాళికలకు తుది రూపు ఇస్తున్నారు. ఈ రైలులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు బుల్లెట్ రైలు దేశ వ్యాప్తంగా అందరికీ ప్రత్యేకంగా మారుతోంది.

దేశంలో తొలి బుల్లెట్ రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది. కేంద్ర ప్రభుత్వం మొదటి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న 'B28' బుల్లెట్ ట్రైన్ కమర్షియల్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ తుది కసరత్తు జరుగుతోంది. ముందుగా సూరత్- వాపి విభాగంలో తొలి సర్వీసును ప్రారంభిస్తామని, ఆ తర్వాత దశలవారీగా ముంబయి వరకు పూర్తి కారిడార్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. ఈ తొలి బుల్లెట్ ట్రైన్‌కు B28 అని పేరు పెట్టారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) సంస్థలు సంయుక్తంగా ఈ స్వదేశీ రైలును తయారు చేస్తున్నాయి.

 అమరావతికి కేంద్రం మరో వరం, కీలక మలుపు..!!
అమరావతికి కేంద్రం మరో వరం, కీలక మలుపు..!!
bullet-train-railway-ministry-fixes-launch-date-and-route-for-its-first-bullet-train-service-detai

అధునాతన సౌకర్యాలతో

బుల్లెట్ ట్రైన్ మొత్తం పొడవు సుమారు 202 మీటర్లు ఉంటుంది. దీంట్లో 8 కోచ్‌లు ఉంటాయి. నాలుగు మోటార్ కార్లు, నాలుగు ట్రైలర్ కార్లతో రైలు నిర్మాణం ఉంటుంది. ఒకేసారి సుమారు 557 మంది ప్రయాణించవచ్చు. దీంట్లో 3x2 సీటింగ్ అరెంజ్‌మెంట్స్‌తో 7 స్టాండర్డ్ క్లాస్ కోచ్‌లు, 2x2 సీటింగ్‌తో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ ఉంటాయి. సూరత్-బిలిమోరా సెక్షన్‌ ప్రారంభించాక.. వాపి-సూరత్ ప్రారంభమవుతుందన్నారు. ఆ తర్వాత వాపి-అహ్మదాబాద్, అహ్మదాబాద్-థానే మార్గాలు మొదలవుతాయన్నారు. చివరగా అహ్మదాబాద్-ముంబై సెక్షన్‌లను ప్రారంభిస్తామని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్లు ఉంటుంది. డిసెంబర్ 2029 నాటికి ఈ కారిడార్ పనులన్నీ పూర్తై పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. దేశంలో మొత్తం ఏడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలుత ముంబై-అహ్మదాబాద్ కారిడార్ ప్రారంభం కానుంది. అనంతరం మిగతా కారిడార్ల పనులు ప్రారంభం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+