పసిడి రేట్లు నేలమట్టం.. !!
దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఆరంభమైన నేపథ్యంలో పసిడి, వెండి ప్రియులకు భారీ ఊరట లభిస్తోంది. ఇదివరకు ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు దిగొస్తోన్నాయి. నేడు కూడా వీటి ధరల్లో తగ్గుదల నమోదైంది. మున్ముందు రేట్లు మరింత తగ్గుతాయనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ వద్ద ట్రేడింగ్ సెషన్స్ సానుకూలంగా సాగుతున్నాయి. కొనుగోలుదారుల్లో జోష్ నింపుతున్నాయి.
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం.. ఈ నెల 16 నుంచి 20 మధ్య కాలంలో పసిడి ధరలు ఊహించని స్థాయిలో క్షీణించాయి. ఈ అయిదు రోజుల వ్యవధిలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 11,000 రూపాయల వరకు తగ్గింది. వెండి ధరలో 20,000 రూపాయల తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు భారతీయ బులియన్ మార్కెట్‌లో ఈ భారీ మార్పునకు కారణమని విశ్లేషకులు స్పష్టం చేస్తోన్నారు.

24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు 1,34,380 నుంచి 1,22,584 రూపాయలకు పడిపోయింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి ధర ప్రస్తుతం 1,13,203 రూపాయల వద్ద కొనసాగుతుండగా, 18 క్యారెట్ల బంగారం ధర 92,688 రూపాయలకు క్షీణించింది. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. పెళ్లిళ్ల సందర్భంగా పెద్దమొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే వారికి ఖర్చు గణనీయంగా తగ్గినట్టయింది.
పసిడి బాటలోనే వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. ఇండియన్ బులియన్ మార్కెట్‌లో ఈ నెల 16 నాటికి కిలో వెండి ధర 1,69,280 రూపాయలుగా నమోదు కాగా, శుక్రవారం నాటికి అది 1,49,650 రూపాయలకు పడిపోయింది. అయిదు రోజుల్లోనే వెండి ధర సుమారు 20,000 రూపాయలకు పైగా తగ్గినట్టయింది. ఇది మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అంచనాల కంటే భారీగా రేట్లు దిగజారడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,160 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,12,897 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,22,900 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,12,65 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,23,330, రూ.1,13,035 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,23,060, 22 క్యారెట్లు రూ. 1,12,805 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381
ముంబై..
24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 12,508, 22 క్యారెట్లు - రూ. 11,465, 18 క్యారెట్లు - రూ. 9,381














Click it and Unblock the Notifications
