బంగారం ధరల్లో భూకంపం.. హ్యూజ్ క్రాష్
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో పతనం కొనసాగుతూనే వస్తోంది. అమెరికా డాలర్ మారకం విలువ బలోపేతం కావడం, అక్కడి ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ లో వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనాలు బులియన్ మార్కెట్‌ను దెబ్బతీస్తోన్నాయి. ఒత్తిడిని పెంచుతోన్నాయి. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు.. వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్‌లోనూ పడిపోయాయి.
గత ఎనిమిది నెలల కాలంలో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అత్యంత దిగువస్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. గురువారం నాటి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 5,120 రూపాయల మేర క్షీణించింది. 22 క్యారెట్లు రూ. 4,700, 18 క్యారెట్లు రూ. 3,840 మేర దిగజారింది. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు ఏనాడు కూడా ఈ స్థాయిలో పడిపోలేదు. ఈ పరిణామాలు బిత్తరపోయేలా చేస్తోంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ బంగారం ఫ్యూచర్స్ 3.91 శాతం మేర క్షీణించి 10 గ్రాములకు రూ. 1,23,120 వద్దకు చేరింది. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ ధర మరింత దారుణంగా పడిపోయింది. ఏకంగా 6.06 శాతం మేర నష్టపోయి కిలో వెండి రూ.1,48,730 వద్ద నిలిచింది. గ్లోబల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ధర కూడా గణనీయంగా తగ్గడంతో దేశీయ రిటైల్ మార్కెట్లపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,160 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,12,897 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,22,900 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,12,65 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,23,330, రూ.1,13,035 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,23,060, 22 క్యారెట్లు రూ. 1,12,805 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 12,557, 22 క్యారెట్లు - రూ. 11,510, 18 క్యారెట్లు - రూ. 9,420
ముంబై..
24 క్యారెట్లు- రూ. 12,557, 22 క్యారెట్లు - రూ. 11,510, 18 క్యారెట్లు - రూ. 9,418
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 12,557, 22 క్యారెట్లు - రూ. 11,510, 18 క్యారెట్లు - రూ. 9,418
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 12,557, 22 క్యారెట్లు - రూ. 11,510, 18 క్యారెట్లు - రూ. 9,418
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 12,557, 22 క్యారెట్లు - రూ. 11,510, 18 క్యారెట్లు - రూ. 9,418
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 12,557, 22 క్యారెట్లు - రూ. 11,510, 18 క్యారెట్లు - రూ. 9,418












Click it and Unblock the Notifications
