పసిడి రేట్ల పతనం.. నానాటికీ తీవ్రరూపం: దెబ్బకొడుతోన్న పరిణామాలు

దేశీయ కమోడిటీ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. వీటి పతనం నానాటికీ తీవ్రరూపం దాల్చుతోంది. వరుస ట్రేడింగ్ సెషన్ లల్లో ఈ రెండింటి ధరలు కుప్పకూలుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడితో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి, వెండి ధరలు అమాంతం క్షీణించాయి. అమెరికా డాలర్ బలోపేతం కావడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో వడ్డీ రేట్లను మరింత కాలం ఉండొచ్చనే అంచనాలు ఈ పతనానికి ప్రధాన కారణలు అయ్యాయి.

ఎంసీఎక్స్ డిసెంబర్ కాంట్రాక్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ప్రారంభ ట్రేడింగ్‌లోనే దాదాపు 3.94 శాతం తగ్గి 10 గ్రాములకు 1,22,430 రూపాయలకు పడిపోయింది. గురువారం నాటి ముగింపు ధరతో పోల్చుకుంటే ఏకంగా 5,230 రూపాయల మేర తగ్గుదల నమోదైంది. దీన్ని బట్టి చూస్తే.. ధరల పతనం తీవ్రత ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. వెండి ఫ్యూచర్స్ ధర సైతం 5.73 శాతం క్షీణించింది. కిలో రూ. 1,48,466 వద్దకు చేరింది.

Gold and Silver extended significant losses hovering at MCX higher bond yields persistent pressures

అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి భారీ నష్టాలను మూటగట్టుకుంది. కామెక్స్ లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 3,531 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దాదాపు 10 శాతం వరకు నష్టాన్ని చవిచూసింది. ఇక వెండి ధర ఔన్స్‌కు 41 డాలర్లకు దిగొచ్చింది. ఈ వారంలోనే తొమ్మిది శాతానికి పైగా తగ్గింది. మరోవైపు డాలర్ ఇండెక్స్ 103.88 వద్ద కొనసాగుతుండగా, బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 91.98 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడవుతోంది.

బంగారం ధరల్లో భూకంపం.. హ్యూజ్ క్రాష్
బంగారం ధరల్లో భూకంపం.. హ్యూజ్ క్రాష్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ సమీక్షలో వడ్డీ రేట్లను పెంచవచ్చనే ఊహాగానాలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి. డాలర్ ఇండెక్స్ 19 నెలల గరిష్ఠ స్థాయికి సమీపంలో ఉండటంతో పాటు బాండ్ ఈల్డ్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు కమోడిటీల నుండి నిధులను ఉపసంహరించుకుంటోన్నారు. అంతర్జాతీయంగా విక్రయాల ఒత్తిడి పెరగడం వల్ల భారతీయ మార్కెట్లలో కూడా అమ్మకాల సునామీ కనిపించింది.

ఎపిక్ రామాయణ వేవ్: ప్రధాని మోదీ కీలక నిర్ణయం
ఎపిక్ రామాయణ వేవ్: ప్రధాని మోదీ కీలక నిర్ణయం

ఈ ధరల క్షీణత బంగారం కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారింది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం రేట్లు తగ్గుతోండటంతో వీటిని కొనుగోళ్లు ఊపందుకుంటోన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్ లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. దీర్ఘకాలం పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోన్నారు. ఫ్యూచర్స్ పొజిషన్లు కలిగిన వారు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బరాజ్ తెలిపారు.

అయ్యప్ప మాల వేసుకున్నాడని ఆఫీస్ కు రానివ్వని టీసీఎస్ హైదరాబాద్
అయ్యప్ప మాల వేసుకున్నాడని ఆఫీస్ కు రానివ్వని టీసీఎస్ హైదరాబాద్

పసిడి కొనుగోలుదారులు తమ అవసరాలలో కొంత భాగాన్ని ఇప్పుడు కొనుగోలు చేయడం శ్రేయస్కరమని నిపుణులు అంచనా వేస్తోన్నారు. ఫ్యూచర్స్ మార్కెట్ ట్రేడర్లు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తోన్నారు. మార్కెట్ లో ఒడిదుడుకులు కొనసాగుతున్నందున తమ ఆర్థిక స్థోమతను అంచనా వేసుకున్న తర్వాతే మార్జిన్ ఫండింగ్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల గమనం పూర్తిగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ విధాన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ అంచనాలపై ఫెడ్ స్పష్టత నిచ్చే వరకు మార్కెట్లో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ కదలికలు, గ్లోబల్ ట్రెండ్స్ రాబోయే వారాల్లో పసిడి తదుపరి దిశను ఖరారు చేయనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+