శబరిమల యాత్రికులకు కేరళం పోలీసులు కీలక సూచనలు - ఇది తప్పనిసరి..!!
శబరిమల అయ్యప్ప భక్తులకు బిగ్ అప్డేట్. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు కేరళం పోలీసుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని డీజీపీ కార్యాలయం కోరింది. స్వామి వారి దర్శనం కోసం ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి చేసింది. భక్తుల రద్దీని నియంత్రించడం, తొక్కిసలాటకు అవకాశం లేకుండా సురక్షితంగా దర్శనం కల్పించడాని కి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు ప్రకటించారు.
డీజీపీ కార్యాలయం ఈ మేరకు భక్తులకు కీలక సూచనలు చేసింది. ఎరుమేలి-పంబ, వండిపెరి యార్ సత్రం-పుల్లుమేడు అటవీ మార్గాల ద్వారా నడిచి వచ్చే భక్తుల వద్ద కూడా చెల్లుబాటు అయ్యే ఆన్‌లైన్ లేదా స్పాట్ బుకింగ్ రసీదు ఉండాలని సూచించారు. అంతేగాక ఈ మార్గాల్లో రోజుకు గరిష్టంగా రెండు వేల మందికి స్పాట్ బుకింగ్ ఏర్పాట్లు చేశారని చెప్పుకొచ్చారు. పంబ వద్ద పార్కింగ్ సదుపాయాలు పరిమితంగా ఉన్నందున, ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలను నీలక్కల్ బేస్ క్యాంప్‌లో పార్క్ చేయాలని, అక్కడి నుంచి కేరళం ఆర్టీసీ చైన్ సర్వీస్ బస్సుల ద్వారా పంబకు చేరుకోవాలన్నారు. కేరళం హైకోర్టు ఆదేశాల మేరకు నీలక్కల్ నుంచి పంబ వరకు రహదారికి ఇరువైపులా వాహనాలను పార్క్ చేయడం పూర్తిగా నిషేధమని చెప్పారు.

పోలీసుల తాజా సూచనలతో
గతంలో పంపా వద్ద ఉన్న రియల్ టైమ్ స్పాట్ బుకింగ్ కౌంటర్లను నీలక్కల్‌కు మార్చారు. ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోలేని భక్తులు నీలక్కల్‌కు చేరుకుని స్పాట్ బుకింగ్ పూర్తి చేసుకున్న తర్వాతే పంపాకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కేంద్రాల ద్వారా రోజుకు గరిష్ఠంగా 10వేల మందికి అవకాశం కల్పించనున్నట్లు డీజీపీ కార్యాలయం వివరించింది. భక్తులు తమ దుస్తులను పంపా నదిలో వదిలివేయడం పూర్తిగా నిషేధమని, పంపా నది పరిశుభ్రతను కాపాడటానికి, పరిసరాల పర్యావరణ పరిరక్షణకు యాత్రికులందరూ పూర్తి సహకారం అందించాలని సూచించారు. తాజాగా తీసుకున్న నిర్ణయాల ద్వారా భక్తులకు ప్రయోజనకరంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని ఆలయ అధికారులు స్పష్టం చేసారు.













Click it and Unblock the Notifications
