వృశ్చిక రాశి, మకర రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తే, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. డిసెంబరు నెలలో వృశ్చిక రాశి, మకర రాశి వారికి సమగ్ర జాతక ఫలం ఎలా ఉంది? అనే వివరాలను తెలుసుకుందాం.

తులా రాశి, ధనుస్సు రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
తులా రాశి, ధనుస్సు రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

వృశ్చిక రాశి (విశాఖ 4వ పాదం; అనూరాధ; జ్యేష్ఠ)

డిసెంబరు నెల వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం నుంచే సానుకూల ఫలితాలను, నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. తృతీయ స్థానంలోకి రాహువు ప్రవేశించడం వల్ల మీలో ధైర్యం, కార్యదక్షత పెరుగుతాయి. ఏ రంగంలో ఉన్నా ఆశించిన గుర్తింపు, పురోగతి లభిస్తాయి. ఉద్యోగులకు శీఘ్రగతిన పదోన్నతులు, కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన లేదా రావాల్సిన బాకీలు అకస్మాత్తుగా చేతికి అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.

Horoscope predictions and results for these two zodiac signs Scorpio and Capricorn for the Month of December

కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్య పరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. మానసిక ప్రశాంతత, ఉత్సాహం ఉంటాయి. అయితే, ప్రయాణాల్లో ఆహార నియమాలు పాటించడం మంచిది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి.

కన్యా రాశి, వృశ్చిక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం
కన్యా రాశి, వృశ్చిక రాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం

మకర రాశి (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు)

మకర రాశి వారికి డిసెంబరు నెల కీలకమైన మార్పులకు, ఉన్నత స్థాయి అవకాశాలకు వేదికగా నిలుస్తుంది. డిసెంబరు 5న రాహువు మీ రాశిలోకి ప్రవేశించడంతో పాటు లాభ స్థానంలో బుధుడి సంచారం మీకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, వేతన పెంపు లేదా ప్రమోషన్ సూచనలు ఉన్నాయి. రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నవారికి ప్రాబల్యం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. విదేశీ సంపాదన లేదా ఆకస్మిక ధనలాభం కలిగే యోగం ఉంది. అయితే, ఆర్థిక పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి.

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా పనిచేస్తారు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం లేదా శని స్తోత్రం పఠించడం శుభప్రదం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+