Top 10 Heroes: మారిన పాపులారిటీ లెక్కలు.. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌, రామ్ చరణ్‌ స్థానాలివే..

Top 10 Heroes: 'బాహుబలి'లో 'వీడు ఎక్కడున్నా రాజేరా' అనే డైలాగ్ గుర్తుందా? పాన్‌ ఇండియా స్టార్‌డమ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌ కొనసాగుతున్న తీరును చూస్తే ఆ మాటలు మరోసారి గుర్తుకొస్తాయి. సినిమాల రిజల్ట్‌తో పాటు పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీలోనూ ప్రభాస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రముఖ మీడియా రీసెర్చ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా(Ormax Media) విడుదల చేసిన ఆగస్టు 2026 'మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్'జాబితాలో మరోసారి డార్లింగ్ ప్రభాస్‌ టాప్ ప్లేస్ లో నిలిచారు.

ఆర్మాక్స్ మీడియా ప్రతి నెలా ఇండియాలో మోస్ట్​ పాపులర్​ హీరోల లిస్ట్ ను విడుదల చేస్తుంది. తాజాగా వెల్లడైన ఆగస్టు- 2026 ర్యాంకింగ్స్‌లో పాన్‌ ఇండియా సినిమాల ప్రభావం, భారీ ప్రాజెక్టులపై ఉన్న ఆసక్తి, ఆయా హీరోల చుట్టూ కొనసాగుతున్న క్రేజ్‌ వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టాప్‌ 10లో నలుగురు తెలుగు హీరోలు చోటు సంపాదించడం టాలీవుడ్‌ హీరోలకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Top 10 Heroes Prabhas No 1 in India Allu Arjun Mahesh Babu Ram Charan Rankings

నంబర్‌ వన్‌లో ప్రభాస్‌
ఆగస్టు నెలకు సంబంధించి ఆర్మాక్స్‌ జాబితాలో ప్రభాస్‌ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు. గత కొంతకాలంగా పాన్‌ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ చుట్టూ దేశవ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టుల కారణంగా కూడా అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఆయన సినిమాలపై చర్చ కొనసాగుతోంది. ఇక రెండో స్థానంలో బాలీవుడ్‌ స్టార్ షారుఖ్ ఖాన్ నిలిచారు. ఆయన తర్వాత తమిళనాడు సీఎం, స్టార్ స్టార్ దళపతి విజయ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. దీంతో టాప్‌ 3లో మూడు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు కనిపించారు.

అల్లు అర్జున్, మహేష్ లు వరుసగా..
అల్లు అర్జున్ ఈసారి నాలుగో స్థానంలో నిలిచారు. గత నెలతో పోలిస్తే ఒక స్థానం దిగారు. 'పుష్ప 2' తర్వాత ఆయన చేస్తున్న తదుపరి భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉండటం ఆయన పాపులారిటీలో కనిపిస్తోంది. ఇక మహేష్ బాబు ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' కారణంగా మహేష్‌ బాబు ట్రెండింగ్స్ లో ఉన్నారు. అంతే కాదు ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా ఆయన టాప్‌ 10లో స్థిరంగా కొనసాగుతున్నారు.

సూర్యకు మెరుగైన ర్యాంక్‌.. యశ్‌ కొత్త ఎంట్రీ
ఆరవ స్థానంలో తమిళ స్టార్ సూర్య నిలిచారు. గత నెలలో ఏడో స్థానంలో ఉన్న సూర్య ఈసారిగా దూసుకొచ్చారు. ఇక కన్నడ స్టార్ యశ్ మాత్రం ఈసారి టాప్‌ 10లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చి ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు. 'టాక్సిక్‌', 'రామాయణ' వంటి భారీ ప్రాజెక్టులతో ఆయన పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నారు. అలాగే ఈ సినిమాలు వార్తల్లో ఉండటం ఈ జాబితాలోనూ యష్ కు స్థానం దక్కినట్టు తెలుస్తోంది.

చరణ్‌కు 9వ స్థానం.. ఎన్టీఆర్‌కు చోటు లేదు
ఇక సల్మాన్ ఖాన్ ఎనిమిదో స్థానంలో నిలవగా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. గతంలో ఆరు, ఏడు స్థానాల్లో కనిపించిన చరణ్‌ ఈసారి తొమ్మిదో స్థానానికి పడిపోయారు. ఇక పదో స్థానాన్ని బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ దక్కించుకున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌, అక్షయ్ కుమార్‌, అజిత్ వంటి స్టార్లు ఈసారి టాప్‌ 10లో చోటు దక్కించుకోలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ పేరు లేకపోవడం నందమూరి ఫ్యాన్స్ షాక్ గా మారింది.

టాప్‌ 10లో నలుగురు తెలుగు హీరోలు
ఆగస్టు 2026 జాబితాను పరిశీలిస్తే ప్రభాస్‌ (1), అల్లు అర్జున్‌ (4), మహేష్ బాబు (5), రామ్ చరణ్‌ (9).. ఇలా నలుగురు తెలుగు హీరోలు టాప్‌ 10లో ఉన్నారు. ఇది తెలుగు సినిమా హీరోలకు పాన్ ఇండియా లెవల్ ఎలాంటి పాపులారిటీ ఉందో చెబుతోంది. మొత్తంగా ఆగస్టు ర్యాంకింగ్స్‌లో ప్రభాస్‌ అగ్రస్థానాన్ని కొనసాగించగా, షారుఖ్‌, విజయ్‌ తర్వాతి స్థానాల్లో నిలిచారు. బన్నీ, మహేష్‌ టాప్‌ 5లో ఉండగా, సూర్య, యశ్‌, సల్మాన్‌, చరణ్‌, రణ్‌వీర్‌ టాప్‌ 10లో నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+