మటన్ కీమా ఇలా వండితే రుచి అదిరిపోతుంది.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది!

మటన్‌తో చేసే వంటకాల్లో కీమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మసాలాలు చక్కగా పట్టి, మటన్ రుచులు మిళితమైతే కీమా ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వేడి వేడి అన్నం, చపాతీ, రొట్టె, పరోటాలతో కలిపి తింటే ఆ రుచే వేరు. అయితే రెస్టారెంట్‌లో దొరికే విధంగా ఇంట్లోనూ మటన్ కీమా తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సింది సరైన పదార్థాలు, తగినంత సమయం, వండే విధానంలో కొద్దిపాటి జాగ్రత్తలు.

కావాల్సిన పదార్థాలు

మటన్ కీమా - కిలో
ఉల్లిపాయలు - 3 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి -6
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
కారం - రెండు స్పూన్ లు
ధనియాల పొడి - ఒక టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా - టీస్పూన్
పుదీనా, కొత్తిమీర - తగినంత
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా

Mutton Keema Recipe Prepare It This Way for an Irresistible Taste know the process of making mutton keema

తయారీ విధానం

ముందుగా మటన్ కీమాను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా పోయేలా వడకట్టుకోవాలి. స్టవ్‌పై మందపాటి గిన్నె పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఆపై మటన్ కీమా వేసి బాగా కలపాలి. కాసేపు మటన్ కీమా మగ్గిన తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఆపై అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా వేసి బాగా మగ్గించాలి.

కీమా నుంచి నీరు బయటకు వస్తుంది కాబట్టి మొదట కొద్దిసేపు మూత లేకుండా ఉడికించాలి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొద్దిగా నీరు పోసి మూత పెట్టి మీడియం మంటపై పూర్తిగా ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. కీమా మెత్తగా ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొద్దిగా నిమ్మరసం పిండితే రుచిలో మంచి మార్పు కనిపిస్తుంది.

తోటకూర వేపుడు ఇలా చేస్తే నచ్చనివాళ్ళు కూడా ఇష్టంగా లాగించేస్తారు!
తోటకూర వేపుడు ఇలా చేస్తే నచ్చనివాళ్ళు కూడా ఇష్టంగా లాగించేస్తారు!

మసాలా చిక్కబడి నూనె పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.కీమాను మరీ మెత్తగా కాకుండా వండాలి . తినేటప్పుడు మంచి రుచి వస్తుంది. ఉల్లిపాయలను బాగా వేయించడం వల్ల కూరకు సహజమైన తీపి, చిక్కదనం వస్తాయి.పుదీనా, కొత్తిమీర చివర్లో వేస్తే వాటి సువాసన నిలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+