Rajasthan Polls: దూసుపోతున్న కాంగ్రెస్ - చేతులెత్తేసిన బీజేపీ..!
రాజస్థాన్ లో (Rajasthan) జరిగిన గ్రామ స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాల్లో విపక్ష కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. జిల్లా పరిషత్ లు, పంచాయతీలకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార బీజేపీని వెనక్కి నెట్టి పలు చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుకుంటోంది. రాష్ట్రంలోని మొత్తం 37 జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరగగా.. ఇందులో 24 చోట్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అలాగే 419 పంచాయతీ సమితులకు ఎన్నికలు జరగగా.. ఇందులో ఏకంగా 177 చోట్ల హస్తం పార్టీ తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
రాజస్థాన్ గ్రామ స్థానిక సంస్ధలకు తాజాగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ చేపట్టారు. ఇందులో బీజేపీ కంటే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ముందుగా ఎన్నికలు జరిగిన 37 జిల్లా పరిషత్ లలో కాంగ్రెస్ 24 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అధికార బీజేపీ కేవలం 8 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. స్వతంత్ర అభ్యర్దులు మరో నాలుగు చోట్ల ఆధిక్యంలో నిలిచారు. మరో జిల్లా పరిషత్ లో ఏ పార్టీకి కూడా మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అటు 81% కంటే ఎక్కువ పంచాయతీ సమితి వార్డులకు సంబంధించి ట్రెండ్స్ అందుబాటులో ఉండగా, కాంగ్రెస్ 3,351 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది; ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ 1,995 స్థానాలతో, ఆర్ఎల్పీ 459 స్థానాలతో ఉన్నాయి.

అటు పంచాయతీ సమితి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 419 పంచాయతీ సమితుల్లో కాంగ్రెస్ 177 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార బీజేపీ కేవలం 81 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. స్వతంత్ర అభ్యర్దులు మరో 56 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. ఈ ఫలితాల సరళిని బట్టి చూస్తే గ్రామీణ ఎన్నికల్లో కాంగ్రెస్ బలమైన ప్రదర్శన చాటుకుంటోంది. అధికార బీజేపీకి ఇది ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. అయితే, ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక, స్థానిక సంస్థల్లో మెజారిటీని ఏ పార్టీ సాధిస్తుందనే దానిపైనే తుది ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఆధిక్యం కాంగ్రెస్ పార్టీకి 2028 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే అంశంగా భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీకి సంబంధించి ఈ ఫలితాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి ఉన్న మద్దతుపై, అలాగే భజన్ లాల్ శర్మ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications
