కంచుకోట బై పోల్ బరిలో స్టాలిన్ - సీఎం విజయ్ సెంటిమెంట్ అస్త్రం, బిగ్ ఫైట్..!!

తమిళ రాజకీయాల్లో కీలక మలుపు. మాజీ సీఎం స్టాలిన్ తిరిగి అసెంబ్లీకి వెళ్తారా. ఇందు కోసం తన కంచుకోట లాంటి నియోజకవర్గం కొలత్తూరులో పోటీకి దిగబోతున్నారా అనేది ఆసక్తిగా మారింది. తాజా ఎన్నికల్లో స్టాలిన్ ను ఇక్కడ ఓడించిన టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. దీంతో.. ఇక్కడ జరిగే బై పోల్ లో స్టాలిన్ పోటీ పైన చర్చ మొదలైంది. కాగా.. ఇప్పటికే స్టాలిన్ అడుగులు గమనించిన సీఎం విజయ్ కొత్త వ్యూహం సిద్దం చేసారు. కొలత్తూరు బై పోల్ వేళ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారు.

స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే పాడె మోసిన విజయ్..! జెయింట్ కిల్లర్ కు తుది వీడ్కోలు..!
స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే పాడె మోసిన విజయ్..! జెయింట్ కిల్లర్ కు తుది వీడ్కోలు..!

టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు మరణంతో కొలత్తూరు అసెంబ్లీ ఉప ఎన్నిక చర్చగా మారింది. 2021 నుంచి కొలత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎంకే స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం సాధిం చారు. ఈ ఎన్నికల్లో వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా.. స్టాలిన్‌కు 74,202 ఓట్లు వచ్చాయి. దీంతో బాబు 8,795 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితంతో 2011 నుంచి కొలత్తూరులో కొనసాగిన స్టాలిన్ విజయపరంపరకు తెరపడింది.

Kolathur By-Election Will Stalin Contest Vijay s Political Strategy Sparks Interest

కాగా, జెయింట్ కిల్లర్‌ వీఎస్ బాబు ఈనెల 19న అనారోగ్య సమస్యలతో మరణించారు. దీంతో కొలత్తూరు నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో కొలత్తూరు నుంచి స్టాలిన్ మళ్లీ పోటీ చేయాలని డీఎంకే నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. దీనిపై డీఎంకే ఎంపీ సి. రవీంద్రన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కొలత్తూరు అంటేనే స్టాలిన్‌ నియోజక వర్గమని, ఆయన మళ్లీ పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలిపారు.

సీఎం విజయ్ కు సడన్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
సీఎం విజయ్ కు సడన్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

అయితే, పోటీ పైన స్టాలిన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు, ఈ ఉపఎన్నిక డీఎంకే, టీవీకే పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ స్థానాన్ని తిరిగి గెలుచుకోవడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని డీఎంకే భావిస్తోంది. అయితే.. ఇక్కడ స్టాలిన్ ఏ నిర్ణయం తీసుకున్న తిరిగి తామే ఈ నియోజకవర్గం నిలబెట్టుకొనే విధంగా సీఎం విజయ్ కొత్త వ్యూహాలను తెర మీదకు తెస్తున్నారు.

సెంటిమెంట్ అస్త్రం ప్రయోగి స్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించటంతో వారి కుటుంబ సభ్యులకే సీటు ఇవ్వాలని.. ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని కొత్త ప్రతిపాదన తెర మీదకు తెచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లో ఎన్నిక జరిగినా.. ఈ స్థానాన్ని మళ్లీ గెలుచుకుని తమ ఆధిక్యాన్ని ప్రదర్శించా లని విజయ్ టీం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీంతో.. కొలత్తూరు బై పోల్ ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+