సీఎం విజయ్ కు సడన్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

కావేరీ నదీ జలాల విడుదల విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. కర్ణాటక నుంచి తమకు 11 టీఎంసీల నీటిని తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ రెండింటికీ తోడు తమిళనాడు తాజాగా దాఖలు చేసిన మూడో పిటీషన్ ను కూడా తిరస్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

కావేరీ నదీ జలాల వ్యవహారంలో చాలాకాలంగా కర్ణాటక- తమిళనాడు మధ్య వివాదాలు చోటు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. లోటు వర్షపాతం ఉన్నప్పటికీ కూడా కర్ణాటక ప్రభుత్వం ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు తమిళనాడు అవసరాల కోసం రోజూ 3.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ వస్తోంది. దీన్ని 11 టీఎంసీలకు పెంచాలంటూ ఇదివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది తమిళనాడు. పిటీషన్లు వేసింది.

Supreme Court declines Tamil Nadu plea seeking a direction to release 11 TMC of Cauvery water

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ సింగ్‌తో కూడిన ధర్మాసనం సమక్షానికి వచ్చాయవి. అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉన్న బిలిగుండాల వద్ద అక్టోబర్ 6 నాటికి తమకు అందాల్సిన నీటి పరిమాణంలో 11.719 టీఎంసీల మేర లోటు ఏర్పడిందని తమిళనాడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కర్ణాటకలోని కృష్ణా రాజ సాగర్, కబిని వంటి ప్రధాన జలాశయాల్లో తగినంత నీటి నిల్వలు ఉన్నప్పటికీ కూడా తమకు రావలసిన వాటాను ఉద్దేశపూర్వకంగా విడుదల చేయట్లేదని ఆరోపించింది.

బంగారం ధరల్లో భూకంపం.. హ్యూజ్ క్రాష్
బంగారం ధరల్లో భూకంపం.. హ్యూజ్ క్రాష్

ఈ వివాదంలో కావేరీ ట్రైబ్యునల్ తో పాటు నియంత్రణ కమిటీ ఇచ్చిన నిర్ణయాలను అమలు చేయాలని సుప్రీంకోర్టును కోరింది. జూలై 28న నిర్వహించిన సమావేశంలో బిలిగుండాల వద్ద 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీరు అందేలా చూడాలని కర్ణాటకను ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసింది. అప్పట్లో ఈ సిఫారసును నియంత్రణ కమిటీ కూడా సమర్థించిందని, కర్ణాటక మాత్రం ఆ ఆదేశాలను పాటించట్లేదని పేర్కొంది.

చెన్నై రూపురేఖలు మార్చే ప్రాజెక్టులను ప్రారంభించిన విజయ్
చెన్నై రూపురేఖలు మార్చే ప్రాజెక్టులను ప్రారంభించిన విజయ్

ఆ తర్వాత ఆగస్టు రెండోవారంలో రోజుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించినప్పటికీ, తమకు రావలసిన మొత్తం లోటును కర్ణాటక భర్తీ చేయట్లేదని తమిళనాడు వాదించింది. తమ అభ్యర్థన ప్రకారం జూన్ 1 నుంచి ఆగస్టు 12 మధ్య ఏర్పడిన 26.954 టీఎంసీ లోటును భర్తీ చేయాలని కోరింది. కావేరీ ట్రైబ్యునల్ అవార్డ్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా తమకు 64 టీఎంసీల అదనపు జలాలు దక్కాల్సి ఉండగా ఇందులో ఈ ఏడాది 14 టీఎంసీలు మాత్రమే వచ్చాయని, దీన్ని పరిగణనలోకి తీసుకున్నా తమకు 55.29 శాతం వాటా రావాల్సి ఉందని వివరించింది.

కొంపముంచిన శుభ్‌మన్ గిల్ తొందరపాటు నిర్ణయాలు
కొంపముంచిన శుభ్‌మన్ గిల్ తొందరపాటు నిర్ణయాలు

దీనిపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కావేరీ పరివాహక ప్రాంతంలో వర్షాభావం వల్ల జలాశయాల్లోకి ఇన్ ఫ్లో గణనీయంగా తగ్గిందని, కరవు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. బెంగళూరుతో పాటు పరివాహక ప్రాంతాల తాగునీటి అవసరాలు, స్థానిక పంటల రక్షణకే నీరు సరిపోవట్లేదని వాదించింది. ఈ వాదనలను విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+