సన్ గ్రూప్ ఉద్యోగులకు కావ్య అదిరిపోయే గిఫ్ట్- గ్రాండ్ రిసెప్షన్..!!
కావ్య మారన్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన పెళ్లి వేడుకల్లో భాగంగా తన సంస్థ సన్ గ్రూపు ఉద్యోగులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ నెల 25న సిబ్బంది కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నట్లు ఆహ్వానించారు. మరోవైపు ఈ రోజు (శనివారం) చెన్నైలో కావ్యా మారన్, అనిరుధ్‌ల వివాహ రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఈ వేడుకలకు సినీ, క్రికెట్, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, కావ్య తన సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
కావ్య మారన్ తన సంస్థ ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్ట్ బాక్సుల్లో బంగారు ఉంగరాలు, చాక్లెట్లు, వివాహ ఆహ్వాన పత్రికలతో కూడిన గిఫ్ట్ బాక్సులను బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ను వివాహం చేసుకున్న కావ్య మారన్ ఈ సందర్భంగా ఉద్యోగులకు ప్రత్యేకంగా కానుకలు ఇచ్చారు.

ఉద్యోగులకు గోల్డ్ కాయిన్స్ ఇస్తారని అంచనా వేసారు. అయితే, గారు ఉంగరాలు రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. కావ్య, అనిరుధ్ ల వివాహం నవంబర్ 11న జరగగా, చెన్నైలో ఈ రోజు రిసెప్షన్ జరుగుతునంది. కాగా.. సంస్థ ఉద్యోగులకు సైతం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసారు. ఈ నెల 25న లంచ్ కు ఆహ్వానిస్తూ గిఫ్ట్ బాక్స్ ల్లోనే ఆహ్వానాలు అందించారు.
నవంబరు 11న గ్రీస్‌లో కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలో కావ్య - అనిరుధ్ పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఈ జంట 'ఆత్మగౌరవ వివాహం' తో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. వివాహంలో భాగంగా తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ కావ్యకు గొలుసును అందించగా, సూపర్‌స్టార్ రజనీకాంత్ అనిరుధ్‌కు గొలుసు ఇచ్చారు. వధూవరులిద్దరూ ఆ గొలుసు లు మార్చుకున్నారు.
ఈ వివాహ పద్ధతికి చట్టబద్ధత ఉంది. ఇక, ఈ సాయంత్రం చెన్నైలో జరిగే రిసిప్షెన్ కు సినీ, క్రికెట్, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ ఇప్పటికే తన కుటుంబంతో కలిసి చెన్నైకి చేరుకున్నట్లు తెలిసింది. షారుక్‌ఖాన్, కమల్ హాసన్, అల్లు అర్జున్, అజిత్ కుమార్ వంటి ప్రముఖులకు ఈ రిసెప్షన్‌కు సంబంధించి ఆహ్వానాలు అందాయి. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని సమాచారం.














Click it and Unblock the Notifications
