మంత్రాలు లేవు, పురోహితులు లేరు.. అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా?

కోలీవుడ్ రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌ల వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గ్రీస్ వేదికగా నవంబర్ 11న అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో అతిరథ మహారథులు పాల్గొనడం ఒక ఎత్తయితే.. వీరిద్దరూ ఎంచుకున్న వివాహ పద్ధతి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాంటి అట్టహాసమైన ఆచారాలు, వేదమంత్రాలు లేకుండా అత్యంత నిరాడంబరంగా సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ చేసుకుని ఈ జంట కొత్త ట్రెండ్ సృష్టించింది.

అసలు ఈ పెళ్లి ఎలా జరిగిందంటే?

గ్రీస్‌లో జరిగిన ఈ వేడుకలో అనిరుధ్, కావ్య మారన్‌లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పూలమాలలు, బంగారు గొలుసులు మార్చుకున్నారు. అనిరుధ్ కావ్య మెడలో గొలుసు కడుతున్న ఫోటో బయటకు రావడంతో, అసలు వీరు ఏ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారనే చర్చ మొదలైంది. దీనిపై డీఎంకే ఐటీ వింగ్ సెక్రటరీ డాక్టర్ టీఆర్బీ రాజా ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. వీరు తమిళనాడు సామాజిక సంస్కరణ ఉద్యమంలో పుట్టిన 'సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్' చేసుకున్నారని ఆయన వెల్లడించారు.

Anirudh Ravichander and Kavya Maran Tie the Knot in Greece Following Periyar Self-Respect Marriage Tradition

స్టాలిన్, రజనీకాంత్ చేతుల మీదుగా..

ఈ వేడుకలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పెద్దల ఆశీర్వాదంతో జరిగిన ఈ పవిత్ర ఘట్టంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్ర పోషించారు. రజనీకాంత్ కావ్యకు ఒక గొలుసును అందించగా, స్టాలిన్ అనిరుధ్‌కు మరో గొలుసును అందజేశారు. ఆ తర్వాత వధూవరులిద్దరూ పూలమాలలు, ఆ గొలుసులను ఒకరికొకరు మార్చుకుని ఒక్కటయ్యారు. అక్కడున్న ఆత్మీయులందరూ ఈ జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

గ్రీస్‌లో వేడుకగా అనిరుధ్-కావ్య మారన్ వివాహం.. ఫోటోలు వైరల్!
గ్రీస్‌లో వేడుకగా అనిరుధ్-కావ్య మారన్ వివాహం.. ఫోటోలు వైరల్!

ఏమిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్?

సంఘసంస్కర్త పెరియార్ ఈవీ రామసామి ప్రారంభించిన ఆత్మగౌరవ ఉద్యమం నుంచి ఈ వివాహ పద్ధతి పుట్టుకొచ్చింది. కుల వివక్ష, సామాజిక అసమానతలు, పెళ్లిళ్లలో మతపరమైన ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ పెరియార్ ఈ విధానాన్ని తీసుకొచ్చారు. సాధారణ హిందూ వివాహాల్లో మాదిరిగా ఇందులో పురోహితులు, హోమాలు, సుదీర్ఘమైన మతపరమైన తంతులు ఉండవు. పెళ్లి చేసుకునే ఇద్దరి పరస్పర అంగీకారం, సమానత్వానికి మాత్రమే ఇక్కడ పెద్దపీట వేస్తారు. బంధుమిత్రుల సాక్షిగా పూలమాలలు లేదా ఉంగరాలు మార్చుకుని జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేయడమే ఈ పెళ్లి ముఖ్య ఉద్దేశం.

Kavya Maran Anirudh wedding:గ్రీసులో పెళ్లి -ఎవరెవరు హాజరు అవుతున్నారు..?
Kavya Maran Anirudh wedding:గ్రీసులో పెళ్లి -ఎవరెవరు హాజరు అవుతున్నారు..?

చట్టబద్ధత ఎప్పుడు వచ్చింది? తదుపరి వేడుక ఎక్కడ?

ఈ ఆత్మగౌరవ వివాహాలకు 1967లో తమిళనాడు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. హిందూ వివాహ చట్టానికి సవరణ చేస్తూ.. ఎలాంటి మతపరమైన ఆచారాలు లేకుండా సాక్షుల సమక్షంలో చేసుకునే ఇలాంటి పెళ్లిళ్లను అధికారికంగా గుర్తించింది. కాగా, గ్రీస్‌లో వివాహం పూర్తి చేసుకున్న అనిరుధ్, కావ్య మారన్ కుటుంబాలు నవంబర్ 21న చెన్నైలో భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించనున్నాయి. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార మరియు క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+