కావ్య పాపకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్‌ను వీడనున్న విధ్వంసకర ఓపెనర్!

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ రాబోయే ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉండటం, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా తాను ఐపీఎల్ 2027 ఆడలేనని ట్రావిస్ హెడ్ ఇప్పటికే ఫ్రాంచైజీ యాజమాన్యానికి సమాచారం అందించినట్లు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌ఇన్ఫో వెల్లడించింది.

ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై?.. రేపే అసలు ట్విస్ట్! ఆందోళనలో ఫ్యాన్స్!!
ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై?.. రేపే అసలు ట్విస్ట్! ఆందోళనలో ఫ్యాన్స్!!

వేలంలో సన్‌రైజర్స్ పర్స్‌కు రూ.14 కోట్ల అదనపు బలం
ట్రావిస్ హెడ్ దూరం కావడం హైదరాబాద్ బ్యాటింగ్ విభాగానికి పెద్ద లోటే అయినప్పటికీ.. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న మినీ వేలంలో ఫ్రాంచైజీకి ఆర్థికంగా భారీ ఊరట లభించనుంది. 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ రీటైన్ చేసుకున్న ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లలో ట్రావిస్ హెడ్‌ను రూ.14 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ రిలీజ్‌కు ఆమోదం తెలపగానే.. సన్‌రైజర్స్ వేలం బడ్జెట్లోకి నేరుగా రూ.14 కోట్ల జమ కానున్నాయి.

Big Shock for SRH and Kavya Maran Travis Head Withdraws from IPL 2027 Over Workload Full Details Here

రూల్స్ ప్రకారం.. రీటైన చేసుకున్న మిగిలిన నలుగురు క్యాప్డ్ ప్లేయర్లు.. హెన్రిచ్ క్లాసెన్(రూ.23 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.14 కోట్లు), నితీశ్ కుమార్ రెడ్డి(రూ.6 కోట్లు) మొత్తం వేతనం రూ.61 కోట్లుగా ఉంది. ఇది నాలుగు క్యాప్ట్ రిటెన్షన్ స్లాబ్‌లకు కచ్చితంగా సరిపోతుండటంతో ఫ్రాంచైజీ పర్స్ నుంచి ఎలాంటి అదనపు కోత ఉండదు.

వరుస టోర్నీల కోసమే ఈ నిర్ణయం
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టు దాదాపు 20 టెస్ట్ మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, జూన్ నుంచి ఆగస్టు వరకు ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్, ఆ తర్వాత అక్టోబర్-నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. ఈ కీలక సిరీస్‌ల కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండేందుకే ట్రావిస్ హెడ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న యశస్వి జైస్వాల్!
రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న యశస్వి జైస్వాల్!

అభిషేక్-హెడ్ జోడీ రికార్డు ప్రస్థానం
2024 వేలంలో ట్రావిస్ హెడ్‌ను ఎస్ఆర్‌హెచ్ రూ.6.8 కోట్లకు కొనుగోలు చేసింది. హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ ప్రత్యేక చొరవతో జట్టులోకి వచ్చిన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, హైదరాబాద్ జెర్సీలో 43 మ్యాచ్‌లు ఆడి 176.14 స్ట్రైక్ రేట్, 32.95 సగటుతో 1,351 పరుగులు సాధించాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మతో కలిసి ట్రావిస్ హెడ్ సృష్టించిన విధ్వంసం టీ20 క్రికెట్‌కే కొత్త నిర్వచనం ఇచ్చింది. వీరిద్దరూ కలిసి 42 ఇన్నింగ్స్‌లలో 46.14 సగటుతో 1,892 పరుగులు జోడించి, శిఖర్ ధావన్-డేవిడ్ వార్నర్ తర్వాత ఫ్రాంచైజీ చరిత్ర రెండో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచారు. ఇప్పుడు ఈ జోడీ విడిపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+