ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై?.. రేపే అసలు ట్విస్ట్! ఆందోళనలో ఫ్యాన్స్!!

MS Dhoni: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలకు తమ రిటెన్షన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాను ప్రకటించడానికి నవంబర్ 17 తుది గడువుగా ఉంది. ఈ గడువు దగ్గరపడుతున్న కొద్దీ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠతో పాటు ఆందోళన మొదలైంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్లో ఆడరని.. రేపు(నవంబర్ 17) రిటెన్షన్ జాబితాతో పాటే తన ఐపీఎల్ రిటైర్మెంట్‌ను ప్రకటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Ind vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్- హెన్రీ దెబ్బకు 0కే రోహిత్, కొహ్లీ, శ్రేయస్ ఔట్..!
Ind vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్- హెన్రీ దెబ్బకు 0కే రోహిత్, కొహ్లీ, శ్రేయస్ ఔట్..!

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎమోషనల్ పోస్టులు
ధోనీ రిటైర్మెంట్ వార్తలతో కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. "ధోనీ.. రేపు సాయంత్రం 5 గంటలకు నేను వెక్కివెక్కి ఏడుస్తానని నాకు తెలుసు. సీఎస్కేకు ఈ స్థాయి గుర్తింపు తెచ్చినందుకు ధన్యవాదాలు తలా" అంటూ ఓ అభిమాని విరిగిన హృదయం ఎమోజీతో పోస్ట్ చేశాడు. మరో అభిమాని స్పందిస్తూ.. "మీరు మీ చివరి మ్యాచ్ చెపాక్ స్టేడియంలోనే ఆడతానని మాట ఇచ్చారు. దయచేసి ఒక్క మ్యాచ్ ఆడి ఘనంగా వీడ్కోలు తీసుకున్న తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించండి" అని విజ్ఞప్తి చేశాడు. ఆటగాడిగా తప్పుకున్నా మెంటార్ పాత్రలో ధోనీ చెన్నై జట్టుతో కొనసాగుతారని మరికొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలపై ధోనీ గానీ, సీఎస్కే యాజమాన్యం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

MS Dhoni IPL Retirement Buzz Will Thala Bid Farewell Ahead of IPL 2027 Retention Full Details Here

ఐపీఎల్ 2027లో ఆడటంపై ధోనీ ఏమన్నారంటే?
పిక్క గాయం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ధోనీ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. అప్పటి నుంచే ఆయన భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే గత నెల అక్టోబర్‌లో బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ తన రీఎంట్రీపై ఆశలు రేకెత్తించారు. తన శరీరాన్ని ఓ పాత వింటేజ్ కారుతో పోల్చుతూ.. దాన్ని రిపేర్ చేయడానికి వైద్యుల సాయం అవసరమని చమత్కరించారు. డిసెంబర్ కంటే ముందే ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకుంటానని.. డాక్టర్ల నివేదికను బట్టి మరో సీజన్ ఆడగలనో లేదో నిర్ణయించుకుంటానని అప్పట్లో ధోనీ స్పష్టం చేశారు.

ఆరు రోజుల వేటకు తెర.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం!
ఆరు రోజుల వేటకు తెర.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం!
<strong style=సీఎస్కే రిటెన్షన్ జాబితాపై సర్వత్రా ఆసక్తి" title="సీఎస్కే రిటెన్షన్ జాబితాపై సర్వత్రా ఆసక్తి" loading="lazy" width="100" height="56" />
సీఎస్కే రిటెన్షన్ జాబితాపై సర్వత్రా ఆసక్తి

మంగళవారం(నవంబర్ 17) చెన్నై సూపర్ కింగ్స్ తన రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి సమర్పించనుంది. ఇటీవలే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో భారీ ట్రేడ్ డీల్ ద్వారా లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను సీఎస్కే తమ జట్టులోకి తీసుకుంది. జట్టులో జరుగుతున్న ఈ కీలక మార్పుల నేపథ్యంలో రిటెన్షన్ జాబితాలో తలా పేరు ఆటగాడిగా ఉంటుందా లేక ఐపీఎల్‌లో ఓ సువర్ణాధ్యాయానికి తెరపడుతుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+