సుప్రీం తీర్పుపై బిల్కిస్ బానో దిగ్భ్రాంతి..! మళ్లీ పాత భయాలు- లేఖ విడుదల..!

2002 నాటి గుజరాత్ అలర్ల సందర్భంగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడమే కాకుండా, తన కుటుంబంలోని 14 మందిని హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిలో ఇద్దరి జీవిత ఖైదును నిలిపేసి, బెయిల్ కూడా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుపై బాధితురాలు బిల్కిస్ బానో (Bilkis Bano) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలైన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, తన వాదన కూడా వినకుండా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం ప్రకటించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.

ఇందులో ఆమె.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తనకు మీడియా కథనాల ద్వారానే తెలిసిందన్నారు. ఈ తీర్పుతో జీవితంలో మరోసారి తనకు న్యాయం అందకుండా పోయినట్లు అనిపిస్తోందన్నారు. కన్నీళ్లు, బాధతో ఈ ప్రకటన చేయాల్సి వస్తోందన్నారు. తనను కోర్టుకు పిలవకుండా, తన వాదన వినకుండా సుప్రీంకోర్టు ఇలాంటి ఉత్తర్వు ఇవ్వడాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. 2002లో తనకు 19 ఏళ్ల వయసులో జరిగిన ఘటనతో తన చిన్న కుమార్తె, ఇల్లు, మానవత్వంపై ఉన్న నమ్మకం అన్నీ ఒక్కసారిగా చిన్నాభిన్నం అయ్యాయని గుర్తుచేసుకున్నారు. గత 24 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నానని, తనతో పాటు దేశంలోని మహిళలందరి కోసం పోరాడుతున్నానని పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు లక్షల మంది అందించిన మద్దతు దైర్యాన్నిచ్చిందన్నారు.

Bilkis Bano Breaks Silence After Supreme Court Grants Bail to Two Convicts I Will Fight This Order

సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుతో తనలో మరోసారి పాత భయాలు మొదలయ్యాయని బిల్కిస్ తెలిపారు. తనకు, తన కుటుంబానికి ఏదైనా జరుగుతుందన్న ఆందోళన కలుగుతోందన్నారు. తనకు జరిగిన దారుణానికి కారణమైన వ్యక్తుల శిక్షను సుప్రీంకోర్టు ఎలా నిలిపేస్తుందని ఆమె ప్రశ్నించారు. తనకు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కోర్టులో తన వాదన వినిపించే అవకాశం ఎందుకు ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుపై న్యాయపోరాటం చేస్తానన్నారు. తన పిల్లలు జీవితాంతం భయం, బాధతో గడపకూడదనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నట్లు బిల్కిస్ వెల్లడించారు. ప్రతీ మహిళా, ప్రతీ బాధితురాలు జీవితాంతం న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్ధితి ఉండకూడదన్నారు. ఈ ప్రకటనను ఆమె తన న్యాయవాది శోభాగుప్తా ద్వారా విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+