దైవ భూమిలో విషాయం.. లోయలో పడిన బస్సు, 8 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. హరిద్వార్ నుంచి చమోలి వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి వంద మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్రిడ్జిపై నుంచి బస్సు అకస్మాత్తుగా లోయలోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బస్సులో మొత్తం 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. రెస్క్యూ టీమ్‌లు ఇప్పటివరకు దాదాపు 20 మంది గాయపడిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసి, అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Uttarkhand Bus Accident Eight Dead and Twenty-Six Injured After Vehicle Plunges Into Deep Ravine

"స్పీడ్ తగ్గించమన్నా వినలేదు".. బాధితుడి కన్నీటి వ్యథ

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పంజాబ్ అనే బాధితుడు మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్ష్యాన్ని బయటపెట్టాడు. డ్రైవర్ బస్సును విపరీతమైన వేగంతో నడుపుతున్నాడని, తాము రెండు మూడు సార్లు స్పీడ్ తగ్గించాలని కోరినా పట్టించుకోలేదని వాపోయాడు. తాను కాసేపు కన్నుమూసేలోపే ఈ పెను ప్రమాదం జరిగిందని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తులేదని రోదించాడు.

ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారితో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితులకు అన్ని విధాలా ప్రభుత్వ సాయం అందజేయాలని సంబంధిత అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+