వామ్మో.. పసిడి రేట్లు ఇలా పడిపోతున్నాయేంటీ
దేశీయ బులియన్ మార్కెట్‌లో నేడు పసిడి, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. కొద్ది రోజులుగా వరుస నష్టాలతో ఆందోళన కలిగించిన బంగారం ధరలు అదే పంథాను కొనసాగిస్తోన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మారిన సమీకరణాలు, విక్రయాల ఒత్తిడి కారణంగా బంగారం ధరలు దిగివస్తోన్నాయి. గత ఏడాది కాలంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు అత్యల్ప స్థాయికి చేరుకోవడంతో దేశీయ మార్కెట్లో కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతోంది.
వివాహాల సీజన్ నేపథ్యంలో ధరల పతనం వినియోగదారులకు మంచి అవకాశంగా మారింది. డాలర్ బలోపేతం కావడం, బాండ్ ఈల్డ్స్ పెరగడంతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు పసిడిలో ఉన్న తమ పెట్టుబడులను విక్రయించి ఇతర లాభదాయక మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల రాబడులు గణనీయంగా పెరిగాయి. వడ్డీ, డివిడెండ్ లేని బంగారంతో పోలిస్తే బాండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా స్థిరమైన రాబడి వస్తుండటంతో మదుపరులు తమ దృష్టిని వాటి వైపు మళ్లించారు.

ఫ్యూచర్స్ మార్కెట్ లో భారీగా ప్రాఫిట్ బుకింగ్ జరగడం, వెండి ధరలు కూడా ఒకే రోజు మూడు శాతానికి పైగా పడిపోవడం పసిడి మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ స్పాట్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.44 శాతం నష్టపోయి, 3,873.29 డాలర్ల వద్ద కొనుగోళ్లు జరుపుకొంటోంది. ఔన్స్ వెండి ధర 1.14 శాతం పెరిగి 47.49 డాలర్ల మార్కును తాకింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు 0.35 శాతం తగ్గి రూ. 1,35,016, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.58 శాతం నష్టంతో రూ. 1,68,842 వద్ద కొనసాగుతున్నాయి.
సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ తో పోల్చుకుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో రూ. 760 తగ్గింది. 22 క్యారెట్లు రూ. 700, 18 క్యారెట్లు రూ. 570 మేర తగ్గాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,350 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,24,071 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,35,190 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,23,924 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,35,530, రూ.1,24,236 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,35,190, 22 క్యారెట్లు రూ. 1,69,270 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,604, 22 క్యారెట్లు - రూ. 12,470, 18 క్యారెట్లు - రూ. 10,205
ముంబై..
24 క్యారెట్లు- రూ. 13,604, 22 క్యారెట్లు - రూ. 12,470, 18 క్యారెట్లు - రూ. 10,203
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 13,604, 22 క్యారెట్లు - రూ. 12,470, 18 క్యారెట్లు - రూ. 10,203
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 13,604, 22 క్యారెట్లు - రూ. 12,470, 18 క్యారెట్లు - రూ. 10,203
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 13,604, 22 క్యారెట్లు - రూ. 12,470, 18 క్యారెట్లు - రూ. 10,203
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 13,604, 22 క్యారెట్లు - రూ. 12,470, 18 క్యారెట్లు - రూ. 10,203













Click it and Unblock the Notifications
